అక్టోబరు 13 – విశ్వాసము యొక్క నీతి!
“అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను” (ఆది.కా. 15:6).
విశ్వాసము వలన నీతి కలుగుచున్నది (రోమీ. 10:6). ఎంతకెంతకు ఒక మనుష్యుడు, ప్రభువును విశ్వసించి, ఆయనయందు ఆనుకొనుచున్నాడో, అంతకంతకు దేవుని నీతిని అతడు స్వతంత్రించుకొనుచున్నాడు. ప్రభువు కూడాను నీతి అను పైబట్టను అతనికి ధరింపజేయుచున్నాడు (యెషయా. 61:10).
రక్షింపబడుటకు పూర్వము ఒక మనుష్యుడు తన యొక్క స్వనీతిని నమ్ముకొనియుండును, అది మురికి అను నీతిగా ఉన్నది. అయితే అతడు తన మురికియగు మలీనమును తొలగించి, క్రీస్తు యొక్క నీతిని ధరించుకొనుచున్నప్పుడు, నీతిమంతుడు అను ఉన్నతమైన స్థితికి వచ్చుచున్నాడు.
ఒక దినమున భిక్షాటన చేయుచున్న ఒక చిన్నవాడు, ఒక కొబ్బరి టెంకను ఫిడేలువలె చేసుకుని అందమైన సంగీతమును మీటుచుండెను. ఈ సంగతిని ఒక ధనుకుని యొక్క కుమారుడు చూచి, తన యొక్క గొప్ప భావనమునకు అతనిని తీసుకొని వచ్చెను. అతడు అతని సంగీతమును వింటూ ఆనందిస్తూ ఉండెను. అతనితో ఆడుకొనెను. వారు మంచి స్నేహితులైయ్యారు.
అకస్మాత్తుగా ఆ ధనికుడు అక్కడికి వచ్చినప్పుడు, ఆ పేద చిన్నవాడు ఆ ఇంటిలో ఉన్న గొప్ప విలువైన సోఫాలో కూర్చొని ఉండుటను చూచి బహుగా కోపించెను. “ఎవరు ఇతడు?” అని అరిచెను. అతని యొక్క కుమారుడైతే: “నాన్నగారండి, దయచేసి కోపపడకండి. ఇతడు నా స్నేహితుడు. నాన్నగారు నేను ఇతనితో స్నేహము చేయుచున్నాను” అని కన్నీటితో చెప్పెను. తన యొక్క కుమారుని కన్నీటిని చూచిన తండ్రి కోపమును నిమ్మలించుకొని: “కుమారుడా, అతడు నీ యొక్క స్నేహితుడు అంటే, అతనిని నీవు స్నానము చేయించి, శుభ్రపరచి, నీయొక్క వస్త్రములను అతనికి ఇమ్ము. అతడు చక్కగా బట్టలను ధరించుకొని ఉంటే, ఇంట్లో చేర్చుకొందును” అని చెప్పెను.
మీరు తండ్రి వద్దకు రావలెను అనుట కొరకే కుమారుడు తన యొక్క నీతిని మీకు ధరింపజేయుచున్నాడు. బాప్తీస్మమును పొందుచున్నప్పుడు, క్రిస్తు యొక్క నీతిని మీరు ధరించుకొనుచున్నారు. “ఏలయనగా, క్రీస్తు లోనికి బాప్తిస్మము పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు” (గలతి. 3:27).
కుమారుడైన క్రీస్తు మీకు నీతి వస్త్రమును ధరింపచేయుటకు, తన రక్తముచేత మిమ్ములను కడిగి, పరిశుద్ధపరచియున్నాడు, నీతిమంతులుగా చేసియున్నాడు. రక్షణ యొక్క వస్త్రమును తీసుకొని వచ్చి, “నా స్నేహితుడా, ఇది నీ కొరకే తయారు చేయబడిన వస్త్రమునైయున్నది” అని చెప్పుచున్నాడు. ఆనాడు ఆదాము అవ్వ యొక్క స్వనీతి అను అంజూరపు ఆకులను తీసివేసి, జంతు యొక్క చర్మపు వస్త్రమును ధరింపజేసినవాడు, నేడును మీ యొక్క ప్రాచీన మలినమైన స్వనీతీయగు మురికి వస్త్రములను తీసివేయుడి. క్రీస్తు తన యొక్క నీతిని దయచేసియున్నాడు.
దేవుని బిడ్డలారా, ప్రభువు యొక్క నీతిని ధరించుకున్న తర్వాత పరిశుద్ధతను కాపాడుకోనుడి. మీరు రాజాధిరాజు యొక్క పిల్లలు. ప్రభువు యొక్క స్వీకృత దత్తపుత్రులు అను హోదాతో తలెత్తుకొని నడివుడి.
నేటి ధ్యానమునకై: “ఏలయనగా, వారు దేవుని నీతినెరుగక, తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియైయున్నాడు” (రోమీ. 10:3,4).