Appam, Appam - Telugu

అక్టోబరు 08 – గిజిగాడు పిచ్చుక!

“ఆకాశపక్షులను గమనించి చూడుడి” (మత్తయి. 6:26).

మొట్టమొదట నేను ఒక గిజిగాడు పిచ్చుక యొక్క గూడును చూచిన వెంటనే, ఆ పిచ్చుక గూడును కట్టుచున్న విధమును చూచి మిగుల ఆశ్చర్యపడిపోయాను. పరలోకమునందు నాయొక్క గూడును బహు చక్కగా కట్టుకొనవలెనుకదా అని గ్రహించబడ్డాను.

గిజిగాడు పిచ్చుకలను ఇండియా, ఇండోనేషియా, ఆఫ్రికా వంటి దేశములలో చూడవచ్చును. గూళ్ళను తన ముక్కుతోను కాళ్లతోను బహు శీగ్రముగా కట్టుచున్నది. దీనికి కావలసిన నారులను, కీటకాలను, ఆకులను మొదలగువాటిని వాడుచున్నాయి. అవి నేలపై నుండి కొంత ఎత్తులోనే తమ గూడును కట్టుచున్నాయి.

తమ యొక్క పిల్లల మీదను, వాటి భద్రత మీదను అవి అత్యధిక అక్కరగలవై ఉన్నాయి. చూచుటకు ఈ గూళ్లు తలకిందులుగా అల్లినట్లు కనబడుచుండినను, తమ పిల్లల కొరకు ప్రత్యేకమైన అరలను కలిగియుండును.

కొన్ని రకములైన గిజిగాడి పిచ్చుకలు మిగుల ఐక్యమత్యము కలిగియుండును. ఒక పిచ్చుక, గూడును కట్టుటకు ప్రారంభించినప్పుడు, మిగతా పక్షులు కూడాను చేరివచ్చి అన్ని రకములుగా ఆ పక్షికి సహాయము చేయుచుండును. ఒక నిర్ణీత కాలములో, ఒకే మాసములో వందల కొలది పిచ్చుకలు గూళ్ళను చూడవచ్చును. అవి సమాజపు పక్షులుగా సాయంకాల సమయములో ఒకటిగా సమకూడి పాడి ఆనందించుచుండును. దేవుని యొక్క బిడ్డలు ప్రకృతిని చూచి తిలకించి, ఇట్టి గిజిగాడి పక్షులను చూచి, ప్రభువు యొక్క నామమును మహిమ పరచుచున్నారు.

కొన్ని దేశములనందు గల గిజిగాడు పిచ్చుకల రకాలలో మగ పిచ్చుకలు మూడు నాలుగు గూళ్లను కట్టి, తన జత ఆడ పిచ్చుకకు చూపించును. ఈ గూడైతే ఆ ఆడపిచ్చుకకు నచుచున్నదో, అందులోనే అవి కాపురము చేసి గుడ్డు పెట్టి, పిల్లలను పొదిగించును. ఆ తరువాత మిగిలిన గూళ్లను విప్పి వేయును.

గిజిగాడి పక్షులకు బహు చక్కగా గూడును కట్టు జ్ఞానమును ఇచ్చినది మన యొక్క దేవుడైన ప్రభువే. “జీవరాసుల ప్రాణమును మనుష్యులందరి ఆత్మలును ఆయన వశమున నున్నవి గదా” (యోబు. 12:10).

ఈ గిజిగాడి పిచ్చుకలకు విరోధముగా శత్రువులు వచ్చుచున్నప్పుడు, ఇవి అన్నియు ఒకటిగా చేరి శత్రువును తరిమి వేయిచున్నాయి. పాములు పైకి ఎక్కి వచ్చుచున్నప్పుడు, ఏకముగా కూడి స్వరమును హెచ్చించి పామును అడ్డగించుటకు అన్ని మార్గములను ప్రయత్నించి, తమ గుడ్డులను పిల్లలను కాపాడుకొనుచున్నాయి. వాటికి ఉండేటువంటి ప్రేమయు, ఐక్యతయు, ఏక మనస్సును క్రైస్తువులకు ఒక సవాలుగా ఉంటున్నాయి.

దేవుని బిడ్డలారా, పక్షులును, పిట్టలును తమ యొక్క పిల్లలను కాపాడుకుని వాటికి ఆదరణగా ఉండునట్లు, ప్రభువు కూడాను తన యొక్క రెక్కలను చాపి, మరలా కాపాడుచున్నాడు. సమస్త కీడునకు తప్పించి కాపాడుచున్నాడు. పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను, ప్రభువు తన యొక్క రెక్కలతో కప్పి, కంటిపాపవలె మనలను కాపాడుచున్నాడు.

నేటి ధ్యానమునకై: “పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును; దాని కాపాడుచు విడిపించుచునుండును దానికి హానిచేయక తప్పించుచునుండును” (యెషయా. 31:5).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.