మే 14 – సాక్ష్యపు వాక్యము!
“తామిచ్చిన సాక్ష్యపు వాక్యమును బట్టియు వానిని జయించియున్నారు” (ప్రకటన. 12:11).
మీ యొక్క ఓటమి విజయవంతముగా మారునట్లు, బైబిలు గ్రంథము సూచించుచున్న పలు విధములైన సర్వాంగ కవచములను గూర్చి మనము ధ్యానించుచున్నాము. మీరు జయమును పొందవలెను అంటే, మీకు సాక్ష్యాముగల పరిశుద్ధ జీవితము మిగుల అవశ్యము. పరిశుద్ధతగల వానితోనే ప్రభువు కలిసి పనిచేయును.
సాక్ష్యముగల జీవితమునకు పునాధి, పరిశుద్ధ ఆత్మ చేత నింపబడుటలోనే ఉన్నది. బైబిలు గ్రంథము సెలవించుచున్నది: “పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ అంతటను, సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్ష్యులైయుందురు” (అపో.కా. 1:8).
సాక్ష్యముగల జీవితము అనుట, వారమునకు ఒక దినమున ఆలయములో లేచి, నా తలనొప్పి పోయినది, కాళ్ల నొప్పి పోయినది అని సంఘస్తుల అందరి ఎదుట తెలియజేయు సాక్ష్యము వంటిది కాదు. సాక్ష్యముగల ఆదర్శవంతమైన జీవితమును జీవించుటయే. సాక్ష్యముగల జీవితమునైయున్నది. మీ యొక్క నోరు మాట్లాడుట కంటేను, మీ యొక్క జీవితము మాట్లాడవలెను. ఇతరులు కొనియాడునట్లు అది ఉండవలెను.
కేవలము సువార్తను మాత్రము ప్రకటించి, సాక్ష్యమును కోలిపోయినట్లయితే, అట్టి సువార్తను ఎవరు వినుటకు కూడాను వినరు. అందులో నమ్మికను కూడాను ఉంచరు. యేసు యొద్దకు రానేరారు. ఇందు చేతనే మహాత్మా గాంధీ, ఒకసారి: “నేను క్రీస్తును ప్రేమించుచున్నాను; అయితే, క్రైస్తవులను ద్వేషించుచున్నాను” అని చెప్పెను. ఆయన రైలు బండిలో ప్రయాణము చేయుచుండగా, క్రైస్తవులైయున్న బ్రిటిషు దొరలు, రైలు బండి నుండి ఆయనను బయటకు త్రోసివేసి: “నల్ల జాతివాడా, బయటకు పోమ్ము” అని చెప్పుటయె దానికి గల కారణము. ఆయన యొక్క హృదయము గాయపడెను. ఇందు చేతనే క్రైస్తవ మార్గము పై ఆయనకు ఎట్టి పట్టును కలుగలేదు.
నూతనముగా రక్షింపబడినవారు కూడాను కొందరు క్రైస్తవుల యొక్క మోసకరమైన జీవితమును చూచి, వెనుకబడిన జీవితమునకు వెళ్లిపోవుచున్నారు. క్రైస్తవ మార్గమునకు విరోధమైన ఉద్యపు నాయకుడు ఒకడు, రక్షింపబడెను. కుటుంబమునందు ఆయనకు గొప్ప వ్యతిరేకత నెలకొల్పబడెను. ఆయనను హత్య చేయుటకు కూడాను ప్రణాళికవేసిరి. ఒక దినమున తనకు బాప్తిస్మము ఇచ్చిన పాస్టర్ గారు రహస్యముగా ఒక స్థలమునందు నిలబడి, పొగ త్రాగుచుండుటను ఆ నూతన విశ్వాసి చూచెను. ఇట్టి సంగతిని ఆయన సుమంత కూడా ఎదురు చూడలేదు. ఇట్టి పరిస్థితి ఆ సహోదరుని వెనకబడిన జీవితములోనికి వెళ్ళుటకు మార్గము వహించెను.
కీర్తనకారుడు చెప్పుచున్నాడు: “నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు, నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను” (కీర్తనలు. 119:11). విజయవంతమైన జీవితము పరిశుద్ధతతోను, లేఖన వాక్యముతోను ఏకమైయున్న అంశమునైయున్నది. మరియు, అది పరిశుద్ధాత్మునితోను ఏకమునైయున్నది. అట్టి సాక్షపు వాక్యమే సాతాను జయించుటకు మీకు సహాయకరముగా ఉండును.
మీరు మరణాంధకారపు లోయలలో నడచుచున్నప్పుడు, సాక్ష్యముగల జీవితమును చేయుచున్నవారై ఉన్నారా అను సంగతిని సాతాను సుక్షంముగా గమనించును. దేవుని బిడ్డలారా, పరిశుద్ధతగల జీవితము మీకు పరలోకమును తెరచును.
నేటి ధ్యానమునకై: “నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను” (యోహాను. 16:33).