Appam, Appam - Telugu

నవంబర్ 23 – ఆయుష్షును పెంచును!

“యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట దీర్ఘాయువునకు కారణము” (సామెతలు. 10:27).

నేడు పుస్తకాల శాలకు వెళ్లినట్లయితే పలు రకములైన నూతన అంశములు గల గ్రంథములు కనబడుచున్నాయి. ఇది వ్రాతల యొక్క కాలములు. మనుష్యుని యొక్క తెలివిని బయలుపరచుచున్న కాలములు. అనేక పుస్తకములు మనుష్యుని యొక్క అభివృద్ధి కొరకు వ్రాయబడు గ్రంథములై ఉన్నవి. స్నేహితులను సంపాదించుకొనుట ఎలాగు, వ్యాధి లేకుండా జీవించుట ఎలాగు, వృద్ధాప్యమునందు పడుచుతనుముగా కనబడుట ఎలాగు వంటి వివరములను తెలియజేయునట్లుగా గ్రంథములు వెలుపడుచున్నాయి.

పుస్తక నిలయమునందుగల ఒక పుస్తకము నా కన్నులను ఆకర్షించెను. దాని యొక్క పేరు “నూరేండ్లు జీవించుట ఎలాగూ? అనుటయైయున్నది. ఆ పుస్తకము ముద్రించబడ్డ వెంటనే కొనుగోలు చేసాను. దానిని రచించిన గ్రంథకర్త ప్రాణాలతో ఉన్నాడా అని ఆ పుస్తక నిలయపు అధినేత వద్ద అడిగాను. అందుకు అధినేత: “ఆయన లేరు, ఆయన మరణించారు. అరవై సంవత్సరములు కూడా ఆయన చేరుకోలేదు” అని జవాబునిచెను. అరవై సంవత్సరములు వయస్సును దాటని ఆయన నూరేళ్లు జీవించుట ఎలాగు అను పేరుతో పుస్తకమును రచించెను అంటే ఆయన యొక్క రచనను ఎలాగున అంగీకరించగలము? గ్రామపురముల యందు “బట్టతలపై జుట్టును పెంచు తైలమును అమ్మేనట” అని చెప్పుదురు. బైబిలు గ్రంథము ఇట్టి వారిని: “పనికిరాని వైద్యులు” అని వర్ణించుచున్నది.

వాస్తవముగానే ఒక మనుష్యుని యొక్క ఆయుష్షు దినములను పెంచేటువంటి మార్గమును బైబిలు గ్రంధము దట్టముగాను, స్పష్టముగాను తెలియజేయుచున్నది. అది ఎట్టి మార్గము? “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట దీర్ఘాయువునకు కారణము” (సామెతలు. 10:27). “మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము” (కీర్తనలు. 68:20).

అట్టి మార్గములను ఎరిగియున్న హానోకు అను భక్తుడు మరణమును చూడకుండానే కొనిపోబడెను. ఆయనకు భూమి మీద సమాధి లేదు. ‘మరణమా నీ ముల్లెక్కడ? పాతాళమా నీ విజయము ఎక్కడ? అని విజయభేరిని బేరించి మరణము నుండి జీవములోనికి ప్రవేశించిన అద్భుతమైన మనుష్యుడిగా ఉండెను. మన దేశమునందు పలు యోగులును, మునీశ్వరులును మరణము నుండి తప్పించుకొను మార్గములు తమకు తెలిసినట్లుగా అబద్ధముగా చెప్పుచున్నారు. అటువంటి కొందరు తమ యొక్క శరీరము నుండి ప్రాణమనునది విడిచి వెళ్ళిన తరువాత కొన్నాళ్లకు మరలా శరీరములోనికి ఆ ప్రాణము తిరిగి ప్రవేశించునని సవాలును విడిచిరి. అయితే శరీరము నుండి వెడలి వెళ్లిన ప్రాణము మరలా శరీరములోనికి ప్రవేశించనే లేదు.

అటువంటి యోగిల యొక్క శరీరములను వారి యొక్క శిష్యులు పలు నెలలు నమ్మికతో పెట్టి చూచిన తరువాత కుళ్ళిపోయి కంపు కొట్టుచున్న శవములను అలాగునే పడవేసి వెళ్లిపోవుదురు. అయితే హానోకు శారీర మరణమును, ప్రాణము యొక్క మరణమును, నిత్య మరణమును జెయించి చూపించెను.

దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఉన్న మీ యొక్క జీవిత దినములు పొడిగించబడి ఉండుటకు ప్రభువునకు భయపడుడి. అది మాత్రమే కాదు, మీ యొక్క తండ్రిని తల్లిని ఘనపరచుడి. పాపములను విడిచిపెట్టి ప్రభువునకు ప్రీతికరముగా నడుచుకొనుడి. ఆసక్తికరమైన ప్రార్థన ఆయుష్షు దినములను పొడిగించును. రాజైన హిజికియా అలా ప్రార్ధించుట వలన ఆయన యొక్క ఆయుష్షును పదిహేను సంవత్సరములకు ప్రభువు పొడిగించి ఇవ్వలేదా?

నేటి ధ్యానమునకై: “దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను” (కీర్తనలు. 91:16).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.