నవంబర్ 18 – సాధువైన యాకోబు!
“యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను” (ఆది.కా. 25:27).
మూలపితరులలో ఒకడే యాకోబు. ప్రభువు యాకోబును బహుగా ఆశీర్వదించెను. యాకోబునకు దైవ ప్రభువు అను అర్థమునిచ్చు ఇశ్రాయేలు అను పేరును పెట్టెను. యాకోబు యొక్క స్వభావమును, గుణాతిశయమును మనకు ఆశ్చర్యమును కలుగజేయుచున్నది. యాకోబు సాదువై గుడారములో నివసించుచుండెను. యాకోబు యొక్క తల్లి గుణవతియైన స్త్రీ అనుటలో ఆమెయు సాదువై ఉండెను.
బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “సాధువైనట్టి (గుణవతియైన) భార్యను కనుగొనువాడు ఎవ్వడు? అట్టిది ముత్యముకంటెను అమూల్యమైనది. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరు” (సామెతలు. 31:10,28). సాధువైనట్టి స్త్రీయే సాధువైనట్టి పిల్లలను రూపింప చేయుచున్నది. యాకోబు తన తల్లికి బహు ప్రియుడిగా ఉన్నందున అతడు కూడాను సాధువు అని పిలవబడెను.
ఆత్మీయ జీవితములో ఎదుగుటకు మనకు తల్లివలె దేవుని యొక్క సేవకులు అవశ్యము. అపో. పౌలు తల్లి వంటి ఒక దైవ సేవకుడు. “స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించునట్లుగా, మేము మీ మధ్యను సాధువులమై యుంటిమి. మీరు మాకు బహు ప్రియులైయుంటిరి గనుక, మీయందు విశేషా పేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక, మా ప్రాణములను కూడ మీకిచ్చుటకు సిద్ధపడియుంటిమి” అని ఆయన వ్రాయుచున్నాడు (1. థెస్స. 2:7,8).
యాకోబు యొక్క మరొక్క ఔన్నత్యము ఏమిటి? ఆయన గుడారములో నివసించువాడు. గుడారము అనుట ఈ లోకము తాత్కాలికమైనది అను సంగతిని, పెక్కిలింపబడి పోతగినది అను సంగతిని బయలుపరుచుచున్నది. బైబిలు గ్రంథమునందు అనేకమైన గుడారములు కలదు. నోవాహు ద్రాక్షారసమును త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా పండుకొనియుండెను (ఆది.కా. 9:21).
లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసికొనెను” (ఆది.కా. 13:12). లాబాను యొక్క గుడారము కలదు (ఆది.కా. 31:34). ఇశ్శాఖారూ గుడారము (ద్వితీ. 33:18). ఆకాను యొక్క గుడారము (యెహోషువ. 7:24) అను విస్తారమైన గుడారములను చూడవచ్చును.
వాటి మధ్యలో ప్రభువు యాకోబు యొక్క గుడారమును చూచి: “యాకోబూ, నీ గుడారములు ఇశ్రాయేలూ, నీ నివాసస్థలములు ఎంతో రమ్యమైనవి” (సంఖ్యా. 24:5). అని బహు సంతోషముతో చెప్పుచున్నాడు. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహసునాదము వినబడును; యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును” (కీర్తనలు. 118:15). యాకోబునకు గుడారపు జీవితమును నేర్పించినది అబ్రహామే. అబ్రహాము గాని, ఇస్సాకు గాని ఈ భూమి మీద ఉన్న దినములయందు తమ కొరకు ఎట్టి స్థిరమైన నివాసమును కట్టుకొనలేదు.
విశ్వాసము చేత అబ్రహామును, వాగ్దానమునకు సహా వారసుడైన ఇస్సాకును, యాకోబును గుడారములలో నివాసముండినట్లుగా అబ్రహామును గూర్చి బైబిలు గ్రంధము సెలవిచ్చుచున్నది.
దేవుని బిడ్డలారా, మీ యొక్క గుడారము ఎటువంటిది? అది సత్యవంతుల యొక్క గుడారముగాను, నీతిమంతుల యొక్క గుడారముగాను ఉన్నదా?
నేటి ధ్యానమునకై: “మన పౌరస్థితి పరలోకమునందున్నది; అక్కడనుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని రాకడ నిమిత్తము కనిపెట్టు కొనియున్నాము” (ఫిలిప్పీ. 3:20).