Appam, Appam - Telugu

అక్టోబరు 09 – వలయు ఐక్యమత్యమును!

“పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థము” (సామెతలు. 1:17).

సొలోమోను రాజునకు ప్రభువు జ్ఞానమును ఇచ్చినప్పుడు, మృగములు, పక్షులు, నేలమీద ప్రాకు జీవులు, మత్స్యములు మొదలగు వాటిని గూర్చిన మాటలను చెప్పెను (1. రాజులు. 4:33). ఒక పక్షిని పట్టవలెను అంటే, పక్షి చూచుచున్నప్పుడు దాని కన్నుల ఎదుట వలను విరిచినట్లయితే నిశ్చయముగా అందులో చిక్కదు. సాతాను కూడాను తిన్నగా మన యొక్క కాళ్లకు వలను వెయ్యడు. చాటుగా ఉచ్చులను ఒడ్డుచున్నాడు. ఆశను యిచ్ఛలను చూపించుచున్నాడు. కొందరు సాతాను యొక్క వల అని ఎరుగకుండా అందులో పడి వేధనకు గురవ్వుచున్నారు.

పురాతనకాలపు కథ ఒకటి కలదు. గుంపుగా పావురాలు మేయు చుండుటను గమనించిన ఒక వేటగాడు, అవి దిగుచున్న స్థలమును కనిపెట్టి, వాటికి ధాన్యమును వేసి, వలను పరచియుండెను. పావురాలు ఆ సంగతిని ఎరుగక వలలో చిక్కుకొనెను. అయినను, పావురాలు తమలో ఒక ప్రణాళికను వేసుకొని, వేటగాడు వచ్చుచున్నప్పుడు, ఒకేసారి అన్నియు పూర్ణ బలముతో వలతో సహా ఎగిరిపోవలెనని తీర్మానము చేసెను. అలాగునే అవి తప్పించుకొని ఎగిరిపోయెను. ఒక ఎలుక వద్దకు వెళ్లి వలను కోయించుకొని స్వేచ్ఛగా ఎగిరిపోయెను. దేవుని యొక్క బిడ్డలు కలిసిగట్టుగా ప్రార్ధించుచున్నప్పుడు, సాతాను యొక్క శక్తులనుండియు, వలనుండియు విడుదలను పొందుకొనే మార్గము లభించును.

ఒకరు ఒక ఉచ్చులో చిక్కుకున్నగాని, పాపపు కృత్యములో పడిపోయినాగాని, తోటివారందరు ఒకటిగా కలిసి భారము వహించి ప్రార్థించి, వారిని బయటకు తీసుకొని రావలెను. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “సహోదరులు ఐక్యతకలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరమైనది! ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చియున్నాడు” (కీర్తనలు. 133:1,3).

తోడబుట్టిన సహోదరుల కంటెను, మధురమైన, జాలిగల, ప్రేమగల సహోదరుడు. యేసు మనలను సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడలేదు (హెబ్రి. 2:11).

పరలోకమునందుగల తండ్రి యొక్క చిత్తము చొప్పున చేయుచున్నవారే ప్రభువు యొక్క సహోదరులు సహోదరీలు. క్రీస్తు యొక్క రక్తము చేత విమోచింపబడిన దేవుని ప్రజలే సహోదర సహోదరీ (మత్తయి. 12:50). వారే పరలోకమునందు పేరు వ్రాయబడియున్న సార్వత్రిక సంగమైయున్న జ్యేష్టుల సంఘము (హెబ్రీ. 12:23). ప్రభువు రక్షణ పొందుచున్నవారిని అనుదినమును సంఘములో చేర్చుచుండెను (అపో.కా. 2:47).

దేవుని బిడ్డలారా, సహోదల యొక్క సహవాసమైయున్న సంఘముగా కూడి వచ్చుటను ఎన్నడను విడిచిపెట్టకుడి (హెబ్రీ. 10:24). “ఒకటిగా చేరి మనము ప్రార్థించేదము, సాతానుని త్రొక్కెదము; దేశమును స్వతంత్రించుకుందుము” దేవుని బిడ్డల యొక్క ఐక్యమత్యమును, ప్రేమతో కూడిన సహవాసమును ఉండినట్లయితే ప్రభువు కొరకు గొప్ప కార్యములను చేయగలరు. సాతాను యొక్క సమస్త ఉచ్చులకును ఉరులకును తప్పించుకొనగలము.

నేటి ధ్యానమునకై: “పక్షి తప్పించు కొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరినుండి తప్పించు కొనియున్నది, ఉరి తెంపబడెను, మనము తప్పించు కొనియున్నాము” (కీర్తనలు. 124:7).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.