Appam, Appam - Telugu

అక్టోబరు 06 – ఆషేరు యొక్క ఆశీర్వాదములు!

“ఇనుపవియు ఇత్తడివియు నీ పాదరక్షల క్రింద ఉండును. నీవు బ్రదుకు దినములకు తగినట్లుగా నీకు బలము కలుగును” (ద్వితి. 33:25).

మోషేకు నూట ఇరవై సంవత్సరముల వయసైనప్పుడు, తన యొక్క మరణపు దినములు సమీపించుచున్నది అను సంగతిని ఆయన గ్రహించి, ఇశ్రాయేలు ప్రజలందరిని గోత్రాలవారిగా ఆశీర్వదించుటకు తీర్మానించెను. ఆయనపై ప్రభువు యొక్క ఆత్ముడు ప్రవచనపు అభిషేకముతో దిగివచ్చేను.

ఆది.కా. 49 ‘వ అధ్యాయము యాకోబు తన చివరి కాలమునందు తన యొక్క పన్నెండు మంది పిల్లలకు దయచేసిన ఆశీర్వాదముల చేత నిండియున్నది. అదేవిధముగా. ద్వితీ. 33. ‘వ అధ్యాయములో దేవజనుడైన మోషే ఇశ్రాయేలీయుల యొక్క పన్నెండు గోత్రములకు దయచేసిన ఆశీర్వాదములు చోటుచేసుకునియున్నది.

పైన చెప్పబడిన వాగ్దానమును, ఆశీర్వాదమును ఆషేరు ఇంటివారికి చెందినదైయున్నది. ఆషేరు అను మాటకు ఆనందము అనుట అర్థమునైయున్నది. దేవుని యొక్క బిడ్డలైయున్న మీరు ప్రభువునందు ఎల్లప్పుడును సంతోషముగాను, ఆనందముగా ఉండవలెను. (ఫిలిప్పీ. 4:4). “యెహోవాయందు ఆనందించుటయే మీ యొక్క బలము” (నెహెమ్యా. 8:10). ఆనందముగా ఉన్నవారే ఇతరులను ఆనందింప చేయగలరు.

“ఆషేరు తన సహోదరులకంటె ఎక్కువగా ఆశీర్వదింపబడును. తన సహోదరుల కంటె కటాక్షము నొందును, తన పాదములను తైలములో ముంచుకొనును” (ద్వితీ. 33:24) అని బైబిలు గ్రంథము చెప్పుచున్నది.

ఆషేరు యొక్క ఆశీర్వాదములను స్వతంత్రించుకొనేటువంటి మీరు, మిమ్ములను దైవ బలము చేత అంటుకట్టు కొనవలెను. మీరు ఒక ఆత్మీయ ప్రయాణములో ఉండుటచేత, కరుకైన త్రోవ గుండా దాటి వెళ్ళుట చేతను మీకు బలము అవశ్యము. పరలోకము యొక్క బలమును ప్రభువు మీకు వాక్కునిచ్చియున్నాడు (లూకా.24:49).

పరిశుద్ధాత్ముడు మీ మీదకు వచ్చుచున్నప్పుడు, నిశ్చయముగాననే మీరు బలమును పొందుకొందురు. (అపో. కా. 1:8). “యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు” (యెషయా. 40:31).

ఆత్మీయ జీవితములో మీరు ఎన్నడును సోమసిలిపోయి బలహీనతతో తడబడకూడదు. కొండలను, గుట్టలను దాటుకొని వెళ్ళవలెను. ఆకాశమండలము నందుగల దురాత్మల సమూహముతో యుద్ధమును చేసి వాటిని జెయించవలెను. “నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు; వాటి అన్నిటిలోనుండి యెహోవా వానిని విడిపించును” (కీర్తనలు. 34:19) అని బైబిలు గ్రంథము స్పష్టముగా చెప్పుచున్నది.

దేవుని బిడ్డలారా, జీవితపయణములో ఆకాశపు దూతగా వచ్చువాడు మీతో కూడా నడిచి వచ్చుచున్నాడు. వేలకొలది పదివేల కొలది దేవదూతలు మీకు ముందుగా వెళ్ళుచున్నారు. కోట్ల కొలది విశ్వాసుల గొప్ప సైన్యముగా మీతో కూడా నడచుచూనే ఉన్నారు. పరమ కానానును దరిచేరేటువంటి సమయము వచ్చియున్నది. “నీవు బ్రదుకు దినములకు తగినట్లుగా నీకు బలము కలుగును” అని ప్రభువు చెప్పుచున్నాడు.

నేటి ధ్యానమునకై: “నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును; చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను” (కీర్తనలు. 23:6).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.