Appam, Appam - Telugu

అక్టోబరు 05 – ప్రభువు యొక్క రాజ్యము!

“యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచియున్నాడు; ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు” (కీర్తనలు. 103:19)

నేడు ఈ ప్రపంచము యొక్క పరిపాలన ఎవరి చేతిలో ఉన్నా సరే, పరలోకపు సింహాసనము మన ప్రభువద్దనే ఉన్నది. ఆయన యొక్క రాజ్య పరిపాలన అన్నిటి మీద ఉన్నది. ఆయన పరలోకమునందును భూమిమీదను సర్వాధికారము గెలవాడైయున్నాడు (మత్తయి. 28:18)

ఆయన రాజులకు రాజుగాను, ప్రభువులకు ప్రభువుగాను ఉన్నాడు (ప్రకటన. 19:16). మహోన్నతమైన సింహాసనముపై ఆయన ఆసీనుడైయున్నాడు, అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. అంత మాత్రమే కాదు, మన కొరకు విజ్ఞాపన చేయుచున్న ప్రధాన యాజకుడిగాను ఉన్నాడు. ఆయనే మీకు నీతిని జరిగించు సర్వలోకపు న్యాయాధిపతియైనవాడు.

యెషయా యొక్క కాలములో ఉజ్జియా అను రాజు గొప్ప ఔన్నత్యమైన రాజ్య పరిపాలన చేయుచు వచ్చెను. తన పాలనలో తాను ఏదైనా చేయగలడు అను ధైర్యముతో బలి అర్పించెను. యాజకులు ఎంత ఆపినను ఆయన వినలేదు. దానికి బదులుగా యాజకులపై ఆయనకు కోపము వచ్చెను. వెంటనే దేవుని యొక్క దూత ఉజ్జియా రాజును మొత్తినందున అతడు చనిపోయేంత వరకును కుష్టు రోగిగా ఉండవలసినదాయెను.

ఉజ్జియా రాజు చనిపోయినప్పుడు, ప్రభువు యెషయా యొక్క కన్నులను తెరిచేను. అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైయుండుటను ప్రవక్తయైన యెషయా చూచెను. ఎంతటి మనోహరమైన దృశ్యము! లోకమునందు రాజులు రావచ్చును, రాజులు గతించి పోవచ్చును. ప్రభుత్వాలు మారవచ్చును, ప్రభువైతే, “రాజులను త్రోసివేయుచు రాజులను నియమించుచు ఉన్నవాడు” (దానియేలు. 2:21). ఆయన మారనివాడై నిరంతరమును నిత్య సింహాసనముపై ఆసీనుడైయున్నాడు. ఆయన యొక్క రాజ్య పరిపాలనకు అంతమే లేదు. ఆయనే ఆదియు అంతమునైయున్నవాడు.

మీరు ప్రభుత్వమునందు ఉద్యోగమను చేయుచున్నప్పుడు, పలు మంది అధికారులు మారి మారి వచ్చి ఉండవచ్చును. అందులో కొంతమంది కారణము లేకుండానే నేరమును మోపుచన్నవారై ఉండవచ్చును. మీ యొక్క అభివృద్ధిని చూచి, ఆటంక పరుచుచున్నవారిగా ఉండవచ్చును. అయినను మీ యొక్క కన్నులు ప్రభువు తట్టునే చూస్తూ ఉండవలెను.

దావీదు చెప్పుచున్నాడు: “మన దేవుడైన యెహోవా మనలను కరుణించువరకు మన కన్నులు ఆయనతట్టునే చూచుచున్నవి” (కీర్తనలు. 123:2). కొన్ని సమయములలో జవాబు వచ్చుటకు ఆలస్యము అవ్వుచున్నట్లు అనిపించినను నిశ్చయముగా ఆయన నీతిని జరిగించి మంచి ఫలమును మీకు ఆజ్ఞాపించును. కారణము, ఆయన సింహాసనముపై ఆసీనుడైయున్నవాడు.

“ఏలికమీద ఏలిక లేచుచున్నాడు” (యిర్మీయా. 51:46). ఇశ్రాయేలీయులపై బబులోను సామ్రాజ్యము యొక్క ఏలుబడి వచ్చెను. బబులోను సామ్రాజ్యమును నిర్మూలము చేసి మాధీయుల పారశీకుల యొక్క సామ్రాజ్యముల యొక్క పరిపాలన వచ్చెను. ఆ పరిపాలనను నిర్మూలము చేసి గ్రీసు దేశస్థులు పరిపాలన చేయుటకు వచ్చిరి. గ్రీకులపై రోమీయులు పరిపాలన చేయుటకు వచ్చిరి. ఇలాగునే భారతదేశమును కూడాను అనేక రాజ్యములు పరిపాలనచేసెను. అయితే ప్రభువు రాజుల రాజుగా నేడును రాజ్య పరిపాలన చేయుచున్నాడు. ఆయనే మన యొక్క రాజుల రాజు, ప్రభువుల ప్రభువు ఆయనే పరలోకమునందును భూమిమీదను సకల అధికారముగలవాడు.

నేటి ధ్యానమునకై: “ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతము లేనిదైయుండును” (లూకా. 1:33)

Leave A Comment

Your Comment
All comments are held for moderation.