Appam, Appam - Telugu

సెప్టెంబర్ 25 – కీడులేదు!

“ఏ (అపాయము) కీడును రాకుండ యెహోవా నిన్ను కాపాడును; ఆయన నీ ప్రాణమును కాపాడును” (కీర్తనలు. 121:7).

కీడుతో నిండియున్న లోకములో మనము జీవించుచున్నాము. పరిస్థితుల వలన వచ్చు కీడులు, దుష్ట మనుష్యుల వలన వచ్చు కీడులు. విపత్తుల ద్వారాను, వ్యాధుల ద్వారాను వచ్చు కీడులు. ఎండిపోయిన స్థితివలనను, ఉష్ణోగ్రత వలనను వచ్చు కీడులు మొదలగునవి అంతట నిండియున్నాయి. అయితే ప్రభువు మన మధ్యలో నిలబడి సమస్త కీడులనుండి మనలను తప్పించి కాపాడుటకు శక్తిమంతుడిగా ఉన్నాడు.

యబ్బేజు అను పేద యవ్వనస్థుడు ఒక దినమున ప్రభువును చూచి కన్నీటితో ప్రార్థించెను. “నాకు కీడురాకుండ దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా” (1. దినవృ. 4:10). దేవుడు అతడు మనవిచేసిన దానిని అతనికి దయచేసెను!

మీరు దుఃఖముచేత నిండియున్నారా? గొప్ప కీడును అనుభవించియున్నారా? యబ్బేజువలె ప్రార్థించుడి. మీ దుఃఖమును సంతోషముగా మార్చుచున్న ఆయన, కీడురాకుండా మిమ్ములను దాని నుండి తప్పించి కాపాడును. “ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు (అపాయము) కీడు సంభవింపదు” (జెఫన్యా. 3:15).

మనకు కీడును చేయవలెనని తలంచుచున్నవాడు సాతానే. అతడు ప్రత్యక్షముగాను, లేక పరోక్షముగాను కీడును చేయుటకు ప్రయత్నించుచున్నాడు. అయితే ప్రభువు, అతని తలను చితకగొట్టి అతని యొక్క సమస్త తంత్రముల నుండి మనలను తప్పించి కాపాడును. ఎన్నడును ఆయన సాతాను యొక్క చేతులలో మిమ్ములను అప్పగించడు.

మనము ఎల్లప్పుడును ప్రభువుతో నిలిచియుందుముగాక. ప్రభువు యొక్క ప్రసన్నతను వెంటాడుదుము గాక. ఎట్టి కీడును లేని ఒక వెయ్యేల పరిపాలనను ప్రభువు మన కొరకు ఉంచియున్నాడు. ప్రభువు ఎల్లప్పుడును మనకు తోడైయున్నందున కీడు మన దారి చేరుటలేదు.‌ “నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ కీడును చేయువారు లేరు; నాశమును చేయువారు లేరు; సముద్రము జలముతో నిండియున్నట్టు (లోకము) భూమి యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును” (యెషయా. 11:9) అని ప్రభువు వాక్కును ఇచ్చియున్నాడు.

మీరు ఎవరికిని ఎన్నడును కీడు తలంచకయుండుడి. కీడును మాట్లాడకుడి. కీడును చేసిన వారికి కూడాను మేలును చేయువారిగా ఉండుడి. మీరు మీ శత్రువులను ప్రేమించుచున్నప్పుడు, ప్రభువు మీ కొరకు వాదించి యుద్ధము చేయును. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “అయినను ఆయన బుద్ధిమంతుడుగా ఉన్నాడు. ఆయన తన మాటను తప్పకుండా, కీడును చేయు దుష్టుల యింటివారి మీదను, కీడుచేయు వారికి తోడ్పడువారి మీదను ఆయన విరోధముగా లేచును” (యెషయా. 31:2).

దేవుని బిడ్డలారా, మీరు నమ్మినవారు మిమ్ములను విడిచి ఎడబాసినను, దేవుడు మిమ్ములను విడిచి ఎన్నడును ఎడబాయడు. “ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను” (మత్తయి. 28:20) అని ఆయన ఒఢంబడికను చేసియున్నాడు. ఆయన నేడును మీతో కూడా ఉండి మిమ్ములను త్రోవనడిపించును.

నేటి ధ్యానమునకై: “మీరు నాకు కీడుచేయనుద్దేశించితిరి; గాని దేవుడు, నేటిదినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రదికించునట్లుగా, అది మేలుకే ఉద్దేశించెను” (ఆది.కా. 50:20).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.