Appam, Appam - Telugu

సెప్టెంబర్ 08 – బంధాలను జీవింపచేయును!

“నేను ఆపదలలో చిక్కుబడియున్నను నీవు నన్ను బ్రదికించెదవు; నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీచేయి చాపెదవు” (కీర్తనలు. 138:7).

గ్రామాలలో వర్షాకాలము ప్రారంభించి, తొలకరి వర్షము కురియుచున్నప్పుడు, వేసవి కాలపు ఎండలకు వాడిపోయిన చెట్లనియు జీవింపబడును. ఎండిన భూమివలె కనబడు నేలపై పచ్చ పచ్చని గడ్లు మొలచుటకు ప్రారంభించును. నేలపై ఎప్పుడో పడియున్న విత్తనాలు చక్కని మొక్కగా మొలకెత్తును. వర్షము అనునది చేళ్లను జీవింపచేయును. దానిని చూచినప్పుడు మనస్సునకు మిగల సంతోషముగా ఉండును.

అదే విధముగా జీవింపచేయు శక్తి పరిశుద్ధాత్ముడికి కలదు. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “చావునకు లోనైయున్న మీ శరీరములను …. తన ఆత్మద్వారా జీవింపజేయును” (రోమీ. 8:11). “ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్‌ప్రయోజనము” (యోహాను. 6:63). “అక్షరము చంపునుగాని, ఆత్మయైతే జీవింపచేయును” (2. కొరింథీ. 3:6). తెగిపోయిన సంబంధాలను ప్రభువు జీవింపచేయుచున్నాడు.

ఒక సహోదరి రక్షింపబడి అభిషేకము పొందిన తన ఒకే కుమార్తెను, విదేశాలలో ఉద్యోగము చేయుచున్న ఒకరికి వివాహము చేసి ఇచ్చెను. ఆమె అల్లుడు వివాహమునకు తరువాత కొన్ని దినములు ఇండియాలో ఉండిపోయి, విదేశాలకు మరల తిరిగి వెళ్లిపోయెను. తన కుమార్తె వద్ద తాను అక్కడికి వెళ్లి వీసా తీసి, ఆ తరువాత ఆమెను పిలిపించుకుని వెళ్ళునట్లుగా చెప్పెను. అయితే పలు దినములుగా అల్లుడు వద్ద నుండి ఎట్టి జవాబును రాలేదు. అయితే, అకస్మాత్తుగా ఒక దినమున ఆ అల్లుడు వద్ద నుండి విడాకలి నోటీసు వచ్చెను.

అదిరిపోయిన ఆ సహోదరి తిన్నగా తన ఉపవాసపు గదిలోనికి వెళ్లి, “దేవా నా కుమార్తె యొక్క కుటుంబ జీవితమును జీవింపచేయుము. తెగిపోయిన సంబంధాలను జీవింపచేయుము. నా కుమార్తె నీయందు ఆనందించి ఉల్లసించునట్లుగా కుటుంబమును మరలా జీవింపచేయవా, అని చెప్పి కన్నీటితో ప్రార్థించెను. పలు దినములు ఉపవాసము ఉండి ప్రార్థించినప్పుడు, ఒక దైవీక ప్రసన్నత ఆ సహోదరిని కప్పెను. హృదయాంతరంగములో నది వలె సమాధానము పొంగి వచ్చెను. ఆ సహోదరి ఉపవాసమును ముగించుకొని సంతోషముగా బయటికి వచ్చెను.

ఎంతటి ఆశ్చర్యము! ప్రభువు యొక్క హస్తము తారస పడినందున, రెప్పపాటులో తన కుమార్తె యొక్క భర్త హృదయమును ప్రభువు త్రిప్పివేసెను. దైవీక ప్రేమను హృదయములోనికి తీసుకొని వచ్చెను. కొన్ని దినములలో తన అల్లుడు ఇండియాకు తిరిగి వచ్చి తన భార్యను తనతో జీవించునట్లు బతిమాలి వెంటపెట్టుకొని వెళ్లెను. ఆ కుటుంబము మాధుర్యమైన ఒక కుటుంబముగా మారిపోయెను.

మరల ఆ సహోదరి తన కుమార్తె యొక్క భర్త కొరకు ప్రార్థించి, ‘నా దేవా, నా కుమార్తెను ఎలాగున రక్షించి అభిషేకించితివో, అలాగునే ఆమె భర్తను కూడా రక్షించి అభిషేకించవలెను” అని గోజాడెను. కొన్ని దినములలోనే ఆయన రక్షింపబడి కుటుంబ సమేతముగా పరిచర్యను చేయుటకు తన్ను తాను సమర్పించుకొనెను. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “ఇందు విషయమై ఆదామను మొదటి మనుష్యుడు జీవించుప్రాణి ఆయెనని వ్రాయబడియున్నది; కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయెను” 1. కోరింథీ. 15:45).

నేటి ధ్యానమునకై: “అయినను దేవుడు కరుణా సంపన్నుడైయుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము, మనయెడల చూపిన తన మహా ప్రేమచేత, మనలను క్రీసుతో కూడ బ్రదికించెను; కృపచేత మీరు రక్షింపబడియున్నారు” (ఎఫెసీ. 2:4,5).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.