Appam, Appam - Telugu

జూలై 27 – బలిపీఠము మీద అగ్ని!

“బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు” (లేవీ. 6:13).

పాత నిబంధనలో, బలిపీఠమునందే భక్తులు దేవుణ్ణి దర్శించేటువంటి స్థలముగా ఉండెను. బలిపీఠమునందు బలులను దహన బలిగా ప్రభువునకు అర్పించుచున్నప్పుడు, దేవుడు అట్టి సుగంధ సువాసనను ఆస్వాదించెను. ఆనందముతో అట్టి బలిపీఠము యొక్క జ్వాలలోనికి దిగివచ్చి, తన పిల్లలతో మాట్లాడును.

కొత్త నిబంధనలో మీరే ప్రభువు యొక్క బలిపీఠములుగా ఉన్నారు. మీ యొక్క ఆత్మ, ప్రాణము, శరీరము మూడింటిని దేవుని యొక్క బలిపీఠముగా సమర్పించుకొనలెను. సజీవ బలిగా అర్పించుకొనవలెను. అప్పుడు మీ అంతరంగము అను బలిపీఠములో అగ్ని దిగివచ్చును.

పాత నిబంధనలో మూడు రకములైన బలిపీఠమును కట్టిరి. మొదటిది, అది మట్టి చేత కట్టబడెను. రెండోవది, ఉలిచేత చెక్కబడని చెకుముకి రాళ్ల చేత కట్టబడెను. మూడోవది, ప్రత్యక్ష గుడారమునందుగల బలిపీఠము అనునది అడవి తుమ్మ చెట్టు చేత చేయబడి ఇత్తడి రేకు చేత పొదిగింపబడినది.

మట్టి చేత చేయబడిన బలిపీఠము మన యొక్క శరీరమునకు సాదృశ్యముగా ఉన్నది (కీర్తనలు. 103:14). చెకుముకి రాయిచేత చేయబడిన బలిపీఠము మన యొక్క ప్రాణమును సూచించుచున్నది. మ్రానుచేత చెయబడి ఇత్తడి చేత పొదిగించబడిన బలిపీఠము మన యొక్క ఆత్మను సూచించుచున్నది.

నేడు ప్రభువు: “కుమారుడా, నీ ఆత్మను, ప్రాణమును, శరీరమును బలిపీఠంపై సమర్పించుము. సంపూర్ణముగా నిన్ను అర్పించుకొనుము. నేడు నేను నీపై పరలోకపు అగ్నిని వెయ్యబోవుచున్నాను. అగ్నిచేత నింపబోవుచున్నాను. నా అభిషేకమును కొలత లేకుండా కుమ్మరించ బోవుచున్నాను. నీవు నా కొరకు రగులుకొని మండవలెను. నేను నీలో వెయ్యబోవుచున్న అగ్ని ఎన్నడను ఆరిపోకూడదు” అని చెప్పుచున్నాడు.

ప్రభువు మీకు ఇచ్చుచున్న పరిశుద్ధాత్ముని యొక్క అగ్ని అమూల్యమైనది. అట్టి అగ్ని అభిషేకము యొక్క ఔనత్యమును, గొప్ప విలువను గ్రహించలేని అనేకులు, దానిని నష్టపరచుకొనుచున్నారు. లవోదికియా సంఘమును గూర్చి ప్రభువు దుఃఖముతో చెప్పిన మాట: “నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు; నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినయెడల మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటనుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను” (ప్రకటన. 3:15,16) అని చెప్పెను.

అగ్నిగా ఉండవలసిన దేవుని ప్రజలు నులివెచ్చగా ఉండకూడదు. మకమకలాడుచు మండుచున్న వత్తిగా ఉండకూడదు. దివిటీలను ఆరిపోయిన స్థితిలో ఉంచుకునియున్న బుద్ధిలేని కన్యకలవలె ఉండకూడదు. అగ్ని రగులుకొని మండవలెను. గుణవతియైన స్త్రీ యొక్క దీపము ‘రాత్రివేళ కూడాను ఆరిపోకుండా ఉండెను’ (సామెతలు. 31:18).

దేవుని బిడ్డలారా, రాత్రియందు కూడాను ప్రభువు యొక్క ప్రేమయు, ఆసక్తితో కూడిన ప్రార్థనయు మీ యొక్క అంతరంగమునందు అగ్నిగా రగులుకొని మండుచునే ఉండవలెను.

నేటి ధ్యానమునకై: “సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను” (రోమీ. 12:1).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.