జూన్ 25 – మాకు మేలు చూపువాడెవడు?
“మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు; యెహోవా, నీ ముఖ (సన్నిధి)కాంతిని మామీద ప్రకాశింపజేయుము” (కీర్తనలు. 4:6).
మాకు మేలు చూపువాడెవడని అనుటయే నేటి మానవజాతి యొక్క మూల్గుగా ధ్వనించుచున్నది. మాకు ఎట్టి మేలును లేదే, మాకు ఒక హెచ్చింపు లేదే అని చీకటిలో నుండి కీటకాలవలె తపించుచు మొల్గిడుచున్న మూలుగులు పరలోకమునకు వెళ్లి చేరేను. దానికి పరలోకము ఇచ్చుచున్న బదులు యెహోవా ఈరే అనుటయే.
అబ్రహాము ప్రభువును విశ్వాసించినవాడు. ప్రభువు కొరకు ఏమైనాను త్యాగముగా చేయుటకు ముందుకు వచ్చినవాడు. తన కుమారునికి బదులుగా బలి అర్పించుటకు ఒక గొర్రె లేదే అని ప్రభువు యొక్క పర్వతమునందు చుట్టూతా చూచినప్పుడు, తనకు మేలు చూపించుచున్న యెహోవా ఈరే తన కొరకు ఒక గొర్రె పిల్లను సిద్ధపరచి ఉంచుటను చూచెను.
ఆ గొర్రె పిల్ల యొక్క తల ముళ్ళలో చిక్కుకొని ఉండెను. ఆ గొర్రె పిల్లను తీసుకుని వచ్చి తన కుమారుణ్ణి పరుండబెట్టియున్న అదే బలిపీఠముపై పరుండబెట్టి దేవునికై బలి అర్పించెను.
ప్రభువు ఆశ్చర్యముగా మన యొక్క అవసరతలను తీర్చును. కృతజ్ఞత గల హృదయముతో అబ్రహాము, తన అవసరతను దర్శించిన ప్రభువును చూచి యెహోవా ఈరే అని గొప్ప కేక పెట్టెను. యెహోవా ఈరే అను మాటకు రెండు అర్థములు కలదు. ఒకటి నా కొరకు సమస్తము చేసి ముగించుచున్న యెహోవా అనుట. తరువాతది ప్రభువు యొక్క పర్వతమునందు నా అవసరతను సంధించువాడు అనుటయైయున్నది.
మాకు మేలు చూపువాడెవడని మీరు వేదన చెంది కలత చెందక, యెహోవా దేవా, యెహోవా ఈరే, నా కొరకు సమస్తము చేసి ముగించు వాడవు అని చెప్పి ఆయనకు మొరపెట్టుచున్నప్పుడు, దేవుడు తన యొక్క ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరములన్నిటిని క్రీస్తు యేసునందు మహిమలో నెరవేర్చుచున్నాడు. (ఫిలిప్పీ. 4:19).
అబ్రహాము తలంచినదియు ప్రార్ధించినదియు ఒకే ఒక్క సంతానము కొరకే. అయితే ప్రభువు ఒక గొప్ప విశ్వాసపు సంతతిని అబ్రహాము ద్వారా ఇచ్చుటకు సంకల్పించెను. అబ్రహామునకు 99 ఏండ్ల వయస్సు మరియు సారాకు 89 ఏళ్ల వయస్సు అనుట చేత ఇకమీదట మాకు పిల్లలు పుట్టుదురా, మాకు మేలు చూపు వాడెవడని వారు విలపించి ఉండవచ్చును.
అయితే యెహోవా ఈరే వారికి విశ్వాసపు సంతతిని ఇచ్చుటకు సంకల్పించెను. ఆకాశపు నక్షత్రము వలెను, సముద్రపు ఇసుక రేణువుల వలెను ప్రభువు అబ్రహము యొక్క సంతానమును వర్ధిల్ల చేసెను. ఆయనను యెహోవా అనియు, యెహోవా ఈరే అనియు ప్రేమతో పిలుచుట ఎంతటి సమంజసమైనది!
“నీకు అత్యధికముగా సంతానవృద్ధి కలుగజేసి, నీలోనుండి జనములు వచ్చునట్లు నియమించుదును; రాజులును నీలోనుండి వచ్చెదరు” (ఆది.కా. 17:6) అని అబ్రహామునకు వాగ్దానము చేసిన ప్రభువు నమ్మకస్తుడు.
దేవుని బిడ్డలారా, అబ్రహామును ఆశీర్వదించిన ప్రభువు మిమ్ములను కూడా అలాగునే ఆశీర్వదించుటకు శక్తిమంతుడైయున్నాడు.
నేటి ధ్యానమునకై: “మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక; ఆయన క్రీస్తునందు పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను” (ఎఫెసీ. 1:3).