Appam, Appam - Telugu

జూన్ 20 – చెరపట్టుడి!

“ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టుచున్న వారమైయున్నాము” (2. కొరింతి. 10:5).

మన యొక్క మనస్సు ఒక యుద్ధ భూమియైయున్నది. అక్కడ పాపపూరితమైన తలంపులకును, పరిశుద్ధమైన జీవితమునకును మధ్య మాటిమాటికి యుద్ధము జరుగుచున్నది. శరీర ప్రకారమైన తలంపులకును, ఆత్మ సంబంధమైన తలంపులకును ఒకదానితో ఒకటి యుద్ధము చేయుచున్నాయి. మనము శరీర తలంపులకు చోటు ఇచ్చుచున్నట్లయితే, పాపము మనలను జయించుచున్నది. కావున పాప చేయుటకు పురిగొలుపుచున్న తలంపులు మరియు శోధనలను గూర్చి మనము మిగుల హెచ్చరిక గలవారమై ఉండవలెను. క్రీస్తునకు లోబడునట్లుగా ప్రతి తలంపును చెరపట్టుచున్నవారమై ఉండవలెను.

ఒకసారి ఒక సహోదరుడు తాగుడు అలవాటు నుండి విడిపించబడి, మంచి జీవితమునకు తిరిగి పరిశుద్ధ జీవితమునందు ముందుకు సాగుటకు ప్రారంభించెను. అయితే, ఒక దినమందు మధ్యాహ్నమున తన ఇంటిలో ఒంటరిగా ఒక దూరదర్శని కార్యక్రమమును చూస్తూ ఉన్నప్పుడు, అందులో వచ్చిన ఒక ప్రకటన దృశ్యము ఆయన యొక్క హృదయమును ఆకర్షించెను. ఒక చెల్లెలు మత్తు పానీయమును ఒక గిన్నెలో పొంగిపొర్లునట్లు పోసి, తన మధురమైన స్వరముతో పాడుచు అనేక మందిని త్రాగునట్లు చేసెను.

ఆమె అనేకులకు మత్తు పానీయమును పోసి ఇచ్చుటను వారు త్రాగి వేసి తందనాలు ఆడుటను చూచిన వెంటనే ఈయన యొక్క ఊహా శక్తి మిగల వేగముగా పనిచేయుటకు ప్రారంభించెను. తాను ద్వేషించి పక్కకు పెట్టిన తాగుడు అలవాటును స్మరించవలసినదాయెను. మరల తాగినట్లయితే ఎంత బాగుంటుంది అను తలంపు వచ్చెను, పాపము ఆయనను మరలా కబలించెను.

అదే సమయము మరో ప్రక్కనైతే, “నేను దేవుని బిడ్డను, దీనిని చూడకూడదు” అను తలంపు వచ్చెను. ఈ రెండిటికి మధ్యలో గొప్ప పోరాటము, మనస్సులో గొప్ప యుద్ధము. ఆయన కన్నులను మూయుచున్నప్పుడల్లాను, ఆ మత్తు పానియపు సీసాయు ఆ మగువే తలంపుల తెరపైన పరుగులు తీస్తూ ఉండెను. ఎంతకెంతకు దానిని గూర్చి తలంచెనో, అంతకంతకు మత్తు పానీయుము పైన ఆశ అధికమాయెను. చివరకు సారా దుకాణమునకు వెళ్లి మనస్సుకు నచ్చినట్లు త్రాగి వేసెను. దాని తర్వాత ఆయన వల్ల అట్టి తాగుడు అలవాటును జయించలేక పోయెను.

మనము మన యొక్క తలంపులను గూర్చియు, ఊహలను గూర్చియు హెచ్చరికగలవారై ఉండవలెను. మనిషి యొక్క ఊహ శక్తికి గొప్ప శక్తి కలదు. ఒకడు క్షణికమైన సుఖములను తలంచినట్లయితే అతని తలంపులును, జ్ఞాపకాలును, అతని యొక్క అంతరంగ పురుషున్ని మలినపరిచి చివరకు అతనిని పాపపు జీవితమునకు ఈడ్చుకొని పోవును. అయితే ఏ మనుష్యుడు తన యొక్క తలంపును, ప్రార్ధనకును, పరిశుద్ధతకును, లేఖన వచనములకును, పరిశుద్ధ ఆత్మనికిని, సమర్పించు కొనుచున్నాడో, అతడు విజయపు బాటలో నడుచున్నాడు.

దేవుని బిడ్డలారా, మీ యొక్క తలంపులలో పాపము వచ్చుచున్నప్పుడే దానిని ప్రక్కకు నెట్టివేసి యేసు యొక్క రక్తము చేత ఎదిరించి నిలబడుడి. యిచ్చకు చోటిచ్చి అది పాపమును గర్భము ధరించుటకు చోటివ్వకుడి. పవిత్రమైన తలంపులకు మిమ్ములను సమర్పించుకొనుడి.

నేటి ధ్యానమునకై: “వారు దేవుని నెరిగియు, ఆయనను దేవునిగా మహిమ పరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని, తమ వాదములయందు వ్యర్థులైరి; వారి అవివేకహృదయము అంధకార మయమాయెను” (రోమీ. 1:21,22).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.