Appam, Appam - Telugu

జూన్ 10 – చెప్పినట్లుగా!”

“ఎవడైనను …. తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినయెడల వాడు చెప్పినది జరుగును” (మార్కు. 11:23).

మనము చెప్పుచున్న మాటలను ప్రభువు ఘనపరచుచున్నాడు. నీతిమంతుడు చెప్పునది జరుగును (మార్కు. 11:23). అతడు చేయుచున్నదంతాయును సఫలమగును (కీర్తనలు. 1:3). ‘యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల’ నీవు రక్షింపబడుదువు (రోమీ. 10:9) అని బైబిలు గ్రంధము చెప్పుచున్నది.

యేసుని గాయములచేత స్వస్థత పొందితిని (1. పేతురు. 2.24) అనియు, యేసు తానే నా బలహీనతలను వహించుకొని నా రోగములను భరించుకొనెను (మత్తయి. 8:17) అనియు, ఆయనే నన్ను స్వస్థపరచు యెహోవా (నిర్గమ. 25:26) అనియు మనము చెప్పుచున్నప్పుడు స్వస్థతను ఆరోగ్యమును పొందుకొనగలము. ఆయన నన్ను ఏమాత్రమును ఎడబాయడు, నన్ను ఎన్నడును చేయ్యి విడచి పెట్టడు (హెబ్రీ. 13:5) అనియు, ఆయన యొక్క సన్నిధి నాకు ముందుగా వెళుచున్నది (నిర్గమ. 33:14) అనియు, ఆయన నాకు నెమ్మదిని కలుగజేయుచున్నాడు (2. దినవృ. 14:7) అని చెప్పుచున్నప్పుడు మనము దేవుని సముఖమును ఆయన యొక్క ప్రసన్నతను గ్రహించగలము.

నేను దేనిని గూర్చియు చింతపడకుండా ప్రతి విషయములోను నా విన్నపములు దేవునికి తెలియజేయుదును. (ఫిలిప్పీ. 4:6) అని విశ్వాసముతో మనము చెప్పుచున్నప్పుడు చింతల బారి నుండి విడుదలను పొందుకొనగలము. నన్ను బలపరుచుచున్న క్రీస్తు వలన సమస్తమును చేయుటకు నాకు బలము కలదు (ఫిలిప్పీ. 4:13) అని చెప్పుచున్నప్పుడు మనము దేవుని యొక్క బలమును కూడా పొందుకొనగలము.

యెహోవా నా కాపరి; నాకు లేమి కలుగదు (కీర్తనలు. 23:1) అనియు, నా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున నా ప్రతి అవసరమును తీర్చును (ఫిలిప్పీ. 4:19) అని చెప్పుచున్నప్పుడు మనము కొదువు లేకుండా మెండైన జీవితమును పొందుకొనగలము.

ఏమి చెప్పినట్లయితే ఆశీర్వాదములను పొందుకొనగలము? ‘నా దేవుడైన ప్రభువు యొక్క ఆజ్ఞల అన్నిటి చొప్పున చేయుటకు నేను శ్రద్ధకలిగి యుండునట్లు ఆయన యొక్క స్వరమునకు చెవియొగ్గెదను. నా దేవుడైన యెహోవా భూమిమీద నున్న సమస్త జనములకంటేను నన్ను గొప్ప చేయును. నేను పట్టణమునందును ఆశీర్వదింప బడియుందును. పొలములో ఆశీర్వదింప బడియుందును. నా గర్భఫలమును, నా భూఫలమును, నా పశువుల మందలును, నా దుక్కి టెద్దులును నా గొఱ్ఱె మేకల మందలు ఆశీర్వదింప బడియుండును.

నాకు విరోధముగా లేచుచున్న ఎట్టి శత్రువులనైను ప్రభువు నా ఎదుట నిర్మూలము చేయునట్లు అప్పగించును. ఒక మార్గమున నాకు విరోధముగా బయలుదేరి వచ్చుదురు. ఏడు మార్గాలలో నా ఎదుట పారిపోవుదురు. ప్రభువు నా కొట్లలోను నా చేతి ప్రయాసములన్నిటిలోను నాకు ఆశీర్వాదమును ఆజ్ఞాపించును (ద్వితీ. 28:1-8) అనియు లేఖన వాక్యములను విశ్వాసపు ఒప్పుకోలును మీరు చెప్పినట్లయితే సమస్త ఆశీర్వాదములను పొందుకొందురు.

నేటి ధ్యానమునకై: “అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసమువలన మనకు లభించునట్లుగా” (గలతీ. 3:14).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.