నవంబర్ 28 – ఆలయపు ఆవరణము!
“ఆవరణములలో నివసించునట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు” (కీర్తనలు. 65:4).
ఒక పెద్ద ఆలయము యొక్క పాటల బృందములో, దరిదాపులు యాభై, నలభై మంది చోటుచేసుకుని ఉండిరి. చక్కటి సంగీత వాయిద్యములు అక్కడ మీటబడుచుండెను. ఆ పాటల బృందములో వృద్ధుడు ఒకరు ఉండెను. ఆయన బాల్యమునందే రక్షింపబడి, అభిషేకము పొందుకొని ప్రభువును ప్రేమించి ఆరాధించుచు వచ్చెను. అయితే ఆయనకు వయస్సు మలినందున ఆయన స్వరము గరుడుగట్టి బొంగురు పోయి మధురముగా పాడలేకపోయెను. కావున ఆ పాటల బృందము యొక్క నాయకుడు ఆయన సరిగా పాడలేదని చెప్పి ఇంటికి పంపించి వేసేను.
ఆ తర్వాతి వారము పాటల ఆరాధనకు ముందుగా ఒక దేవదూత దిగివచ్చి, ఆ పాటల బృందము యొక్క నాయకుని చూచి, ‘పాటల బృందము నుండి ఒకే ఒక్క వ్యక్తి యొక్క మధురమైన స్వరము మాత్రమే పరలోకమునకు చేరుచున్నది. ప్రభువు గత ముఫ్ఫై సంవత్సరములుగా ఆ స్వరమునందు ఆనందించి సంతోషించుచు ఉండెను. ఆయనను ఎందుకని ఇంటికి పంపించివేసిరి? ఆయన యొక్క స్వరమును వినుటకు ప్రభువు ఆత్రుతతో ఉన్నాడు’ అని చెప్పెనట.
దానికి ఆ పాటల బృందము యొక్క నాయకుడు, ‘పాటల బృందములో మిగిలిన యాభై మంది ఉన్నారు కదా. మధురమైన రాగముతోను, మంచి స్వర పీఠికతోను మధురముగా పాడుచున్నవారు ఉన్నారు కదా’ అని జవాబునిచ్చెను. అందుకు ఆ దేవదూత: ‘వారి స్వరములలో ఏదియు పరలోకమునకు చేరలేదు. కారణము అందులో ఏ ఒక్కరు రక్షిణ పొందుకోలేదు. ఆత్మతోను సత్యముతోను ప్రభువును ఆరాధించలేదు. వారి స్వరములు ఎంతటి మాధుర్యముగా ఉండినప్పటికిని, ఆ ఆలయము యొక్క కొప్పునకు పైగా కూడాను వెళ్ళి చేరుట లేదు. పూర్ణ మనస్సుతోను హృదయాంత రంగములో నుండి వచ్చుచున్న పాటలకే ప్రభువు చెవిగ్గుచున్నాడు. ఆయన స్తుతుల మధ్యలో నివాసము చేయుచున్న ప్రభువు’ అని చెప్పెను.
దేవుని బిడ్డలారా, ప్రభువు యొక్క ఆలయము దేవుని యొక్క గృహమునైయున్నది. ఆయన గృహము యొక్క మేళ్ల చేత తృప్తిచెందవలెను అంటే, ఆయన ఆవరణమునకు వచ్చి ఆయనకు ఆరాధన చేయుడి. ఆయన అక్కడ మిమ్ములను దర్శించి, మీ యొక్క కొదువులను సమృద్ధిచేయును.
మీ యొక్క ప్రతి అవసరమును దర్శించువరకు, దర్శించుటకు మీరు ఆలయమునకు రావలెను కదా? “ఇదిగో, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంతటి మనోహరమైనది! అచ్చట ప్రభువు నిరంతరమును ఆశీర్వాదమును, శాశ్వత జీవమును నుండవలెనని ఆజ్ఞాపించియున్నాడు” (కీర్తనలు. 133:1,3).
దావీదు రాజు తన్ను తాను తగ్గించుకుని: “యెహోవా యొద్ద ఒక్క వరమును అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను; నేను యెహోవా యొక్క ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును, నేను నా జీవితకాలమంతయును నేను యెహోవా మందిరములో నివసించుటయే గోరుచున్నాను” (కీర్తనలు. 27:4) అని చెప్పెను.
దేవుని బిడ్డలారా, ప్రభువు యొక్క ఆలయ ఆవరణములను వెంటాడినట్లయితే ధన్యులుగా ఉందురు.
నేటి ధ్యానమునకై: “నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినములకంటె శ్రేష్టమైనది; భక్తిహీనుల గుడారములలో నివసించుటకంటె నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము” (కీర్తనలు. 84:10).