నవంబర్ 22 – బుద్ధిమంతుడు!
“గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును” (సామెతలు. 15:5).
గద్దింపును అనేకులు కోరుకొనరు. మనస్సుకు నచ్చినట్లు నడుచుటయే వారు కోరుకొనుచున్నారు. తమ యొక్క దారిలో ఎవరును అడ్డు రాకూడదు అనియు, తమకు ఎవరును బుద్ధి చెప్పనవసరము లేదు అనియు, మాకు సమస్తము తెలియును అనియు చెప్పి, ఇష్టము వచ్చినట్లుగా నడిచి చివరకు వేదనను అనుభవించుచున్నారు.
అయితే నిజమైన బుద్ధిమంతుడు తనకు బుద్ధి ఉండినప్పటికిని, జ్ఞానము ఉండినప్పటికిని ఇతరుల యొక్క మాటను వినుచున్నాడు. తగ్గింపుతో పెద్దవారి యొక్క ఆలోచనలను అంగీకరించుచున్నాడు. బైబిలు గ్రంథమునకు చెవియెగ్గుచున్నాడు. కారణము ఏమిటి? “ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును; అయినను తుదకు అది మరణమునకు చేరును” (సామెతలు. 16:25) అను సంగతిని అతడు ఎరిగియున్నాడు.
ప్రభువు తాను ప్రేమించుచున్న కుమారుని శిక్షించుచున్నాడు. పలు సమయములలో ఖండించుచున్నాడు, దండించుట కూడాను చేయుచున్నాడు. అయితే ఆ సంగతిని మనము ఎన్నడును చులకనగా ఎంచకూడదు. ప్రభువు యొక్క ఆలోచనలు నిరంతరమును నిలబడుచున్నదై ఉండిన్నందున బైబిలు గ్రంథమునకు చెవియొగ్గవలెను. ప్రభువు యొక్క మార్గములలో నడవవలెను, అది నిజమైన బుద్ధి.
దావీదునుకు ఒక ప్రత్యేకమైన గుణము ఉండెను. ఆయన సెలవిచ్చుచున్నాడు: “నీతిమంతులు నన్ను కొట్టుట, నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట; నాకు తైలాభిషేకము; నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థనచేయుచున్నాను” (కీర్తనలు. 141:5).
బెత్సబా విషయములో దావీదు పాపము చేసినప్పుడు, దావీదు యొక్క దృష్టిలో అది పొరపాటుగా తెలియలేదు. అయితే ఒక దినమున ప్రభువు నాతాను ప్రవక్తను దావీదు వద్దకు పంపించి గ్రహింపజేసినప్పుడు, దావీదు అట్టి గద్దింపునకు చెవియోగ్గెను. కన్నీటితో తన యొక్క పాపములను ఒప్పుకొని, దేవుని యొక్క కనికరమును, సమాధానమును పొందుకొనెను. ఒక మనుష్యుని నిజముగా ఖండించి సరిదిద్దుచున్న నీతిమంతుడు అతనికి ఆశీర్వాదకరమైన వాడే.
అపో. పౌలు చెప్పుచున్నాడు: “ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు; దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు?” (హెబ్రీ. 12:6,7).
బుద్ధి మతులను అంగీకరించి తన్ను తాను సరిదిద్దుకొనువాడే నిజమైన బుద్ధిమంతుడు. దావీదు అలాగునే తన్నుతాను సరిదిద్దుకొనెను. అయితే సౌలు యొక్క యుద్ధ సైన్యాధిపతిగా ఉన్న అబ్నేరు ఇదే విధముగా రిస్ఫా విషయములో ఖండించినప్పుడు కోపమును తెచ్చుకుని బుద్ధిహీనుడాయెను (2. సమూ. 3:7,8).
దేవుని బిడ్డలారా, సంఘకాపరుల యొక్క బుద్ధి మతులకు చెవియొగ్గుడి. ప్రభువు యొక్క ఆలోచనలకు చెవియగ్గుడి.
నేటి ధ్యానమునకై: “జ్ఞానములేనివారలారా, జ్ఞానము ఎట్టిదైనది తెలిసికొనుడి; బుద్ధిహీనులారా, బుద్ధియెట్టిదైనది యోచించి చూడుడి. నేను శ్రేష్ఠమైన సంగతులను చెప్పెదను; వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును” (సామెతలు. 8:6).