Appam, Appam - Telugu

నవంబర్ 20 – సామెతలు!

“దావీదు కుమారుడును ఇశ్రాయేలీయులకు రాజునైయున్న సొలొమోను సామెతలు” (సామెతలు. 1:1).

బైబిలు గ్రంధమునందు జ్ఞానోక్తులు, సామెతలు, ఉపదేశములు, హెచ్చరోక్తులు కలవు. బైబిలు గ్రంధంలో సామెతల గ్రంథమునందు ముఫై ఒకటి అధ్యాయములు ఉన్నాయి. జనవరి, మార్చి, మే, జూలై, ఆగస్టు, అక్టోబరు, డిసెంబరు మొదలగు మాసములలో నెలసరి దినములు మొత్తము ముఫై ఒకటి దినములు వచ్చుచున్నాయి.

ఒక దినమునకు ఒక అధ్యాయము చొప్పున చదివినట్లయితే మాసము యొక్క చివరకు ముఫై ఒకటి అధ్యాయములను చదివి ముగించవచ్చును. కొన్ని మాసములలో ముఫ్పై దినములు గాని, ఇరవై ఎనిమిది దినములు గాని వచ్చినట్లయితే మిగిలియున్న అధ్యాయములను చివరి దినములలో చదివి ముగించుట మంచిదైయుండును.

అనేక సంఘములలో సంఘ కాపరులు తమ యొక్క సంఘస్తులను ఒక దినమునకు ఒక అధ్యాయమైనను సామెతల గ్రంథములో నుండి చదువవలెనని ఆలోచనను చెప్పుచున్నారు. ఎందుకనగా, “వీటివలన జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతిన్యాయ యథార్థతల ననుసరించుటయందును, బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును, నీతిన్యాయ యథార్థతల ననుసరించుటయందును బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును, జ్ఞానములేని వారికి బుద్ధి కలిగించుటకును, యౌవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును, తగిన సామెతలు. జ్ఞానముగలవాడు విని పాండిత్యము వృద్ధిచేసికొనును వివేకముగలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును….. గ్రహించుదురు (సామెతలు. 1:2,6).

సామెతలలో ప్రాముఖ్యమైన మాట “జ్ఞానము” అనుటయైయున్నది. జీవితమును బహు రమ్యముగా జీవించుటకు దేవుడు ఇచ్చుచున్న ఆలోచనలే జ్ఞానమునైయున్నది. పాపమును, దుర్మార్గమును, అక్రమమును నిండిన లోకములో ఒక మనుష్యుడు పరిశుద్ధముగా జీవించుటకు జ్ఞానము అవశ్యము. సామెతల గ్రంథము మనుష్యునికి దేవునికి మధ్యగల సత్సంబంధమును చెప్పియున్నది. మనుష్యునికిని మనుష్యునికిని మధ్యగల సత్సంబంధమును చెప్పియున్నది. ఇక్కడ తల్లిదండ్రులకు ఇవ్వబడియున్న ఆలోచనలు కూడాను కలవు.

సామెతల గ్రంథమునందు గల సమస్తమును రచించినది సొలోమోను కాదు. సామెతల గ్రంథము యొక్క ముఫ్పైయోవ అధ్యాయమును వ్రాసినది, “యాకెలు యొక్క కుమారుడైన ఆగూరు అను మనుష్యుడు ఈతీయేలునకు పలికిన మాటలును, అనగా ఈతీయేలునకును ఉక్కాలునకును చెప్పిన ఉపదేశపు మాటలు” (సామెతలు. 30:1) నైయున్నది. అదేవిధముగా మైఫ్పై ఒకటవ అధ్యాయము “రాజైన లెమూయేలునకై చెప్పబడిన మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి, అని సూచించబడియున్నది.

“ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛను బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింప బడినవారై దేవుని మూలముగ పలికిరి” (2 పేతురు. 1:20,21).

దేవుని బిడ్డలారా, ప్రభువు మీకు అనుగ్రహించిన మాటలు గానే పఠించి సామెతల గ్రంథము యొక్క లబ్ధినంతటిని పొందుకొందురుగాక.

నేటి ధ్యానమునకై: “దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు; దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజన కరమైయున్నది” (2 తిమోతికి. 3:16,17).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.