జనవరి 06 – కంచెనువేసి!
“ఆయన దానికి కంచెను వేసి….” (యెషయా. 5:2).
ద్రాక్ష తోటను నాటిన ప్రభువు దానికి ఒక కంచె కావలెను అని చూచెను. కంచలేని ద్రాక్షాతోట తెరవబడియున్న స్థితిలో ఉండును. మేకలును ఆవులును వచ్చి మేసి పాడుచేయును. అడవి పంది దాని యొక్క వేరుళను పెరికివేయను. అందుచేత ప్రభువు కంచె వేయుటకు తీర్మానించెను.
కంచె అను పదమునకు రెండు అర్థములు కలదు. మొట్టమొద, అది మిగతా తోటల నుండి ప్రత్యేకపరుచుచున్నది. రెండవది, అది భద్రతను ఇచ్చుచున్నది. ప్రభువు అబ్రహామును పిలిచినప్పుడు మొట్టమొదటిగా తన యొక్క దేశమును, జనమును, తండ్రి ఇంటిని విడిచి పెట్టి ప్రత్యేకింపబడుమని చెప్పెను. దాని తరువాత అబ్రహామునకు ఆయన జీవిత దినములన్నిటను తానే కంచెగా నిలబడి కాపాడెను. అందుచేత మనము ప్రభువు కొరకు ప్రత్యేక జనముగా ఉండి, దేవుని యొక్క కంచెను సమ్మతించుచున్నప్పుడు, అది మనకు భద్రతగా అమర్చబడుచున్నది.
యెషయా 5 ‘వ అధ్యాయము 2 ‘వ వచనమునందు కంచె అనియు, 5 ‘వ వచనమునందు “దాని (కంచెను) అడ్డును” అనియు రెండు విధములైన పదములు వాడబడియున్నది. అడ్డు అని అంటే ఆంగ్లమునందు ‘రాతి గోడ’ అను అర్థమునైన్నది. అది భద్రతనిచ్చు గోడ. అదే సమయమునందు, దాని తర్వాతది ముల్లకంచెయు దానితోపాటు ఉన్నది.
ఆత్మీయ అర్థమునందు ముళ్లకంచెయు, అడ్డుగోడయు యేసుక్రీస్తు యొక్క రక్తము చేత మనకు లభించుచున్న భద్రతయైయున్నది.
పాత నిబంధన ఇశ్రాయేలు ప్రజలు పస్కా గొర్రెపిల్ల యొక్క చాటున ఉన్నప్పుడు సంహారపు దూతచేత వారి యొక్క కుటుంబమునకు ఎట్టి హాని చేయలేకపోయెను. కొత్త నిబంధనయందు యేసు క్రీస్తు తన యొక్క సొంత రక్తమును, చెమటను, కన్నీటిని చిందించి మనకు ప్రార్ధన కంచెగా ఆయెను.
మనకు కంచెగా యేసుక్రీస్తు యొక్క ప్రార్థన కలదు (యోహాను. 17:11). పరిశుద్ధాత్ముని యొక్క ప్రార్ధన కలదు (రోమీ. 8:26). ప్రభువు యొక్క సేవకుల ప్రార్థన కలదు, అశంఖ్యాకులైన విశ్వాసులు యొక్క ప్రార్ధన కలదు, సంఘము యొక్క ప్రార్థన కలదు. ప్రభువు యొక్క బిడ్డల కంచె ఎంతటి శక్తి గలది! ” యెరూషలేము చుట్టు పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టు ఉండును” (కీర్తనలు. 125:2).
మీ యొక్క విశ్వాసపు కన్నులు తెరవబడును. ప్రభువు మీ చుట్టూతా కంచెగాను, ప్రాకారముగాను నిలబడుటను చూచెదరు గాక! యాకోబు యొక్క సంతతికి ఆనాడు కంచెగాను, ప్రాకారముగాను ఆయన నిలబడుటను ఆది.కా. 35:5 నందు చదివి చూడుడి. అదే విధముగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడిచి బయలుదేరినప్పుడు, ప్రభువు వారికి కంచెగా, అగ్ని ప్రాకారమును ఆజ్ఞాపించెను.
సింహాల గుహలో దానియేలునకు సింహములు ఎట్టి హాని చేయకుండున్నట్లు తానే కంచెగా నిలబడెను. షద్రకు, మేషాకు, అబేద్నగోలను అగ్నికుండములో పడవేయబడినప్పుడు, వారికి అగ్నిచేత హాని ఏమియు కలగకుండునట్లు కంచె ఆయెను. నేడు అగ్ని ప్రాకారముగా నేను మిమ్ములను ఆవరించియుందును అని పరిశుద్ధాత్ముడును మనకు అనుగ్రహించియున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభువు మిమ్ములను కాపాడునట్లు తన యొక్క దేవదూతలకు ఆజ్ఞాపించియున్నాడు
నేటి ధ్యానమునకై: “ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును; ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును; ఆయన సత్యము, కేడెమును డాలునైయున్నది” (కీర్తనలు. 91:4).