Appam, Appam - Telugu

సెప్టెంబర్ 19 – ఆకాశపు సూచకక్రియ!

“ఆకాశము నుండి యొక సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడిగెను” (మత్తయి. 16:1).

యూదులు ఎల్లప్పుడును సూచకక్రియను వెతుకుచూనే ఉండిరి. వారు ప్రభువు యొక్క మాటలను నమ్మలేదు (మత్తయి. 12:38). ఆయనను శోధించుటకు ఆకాశము నుండి యొక సూచక క్రియను అడిగిరి.

నేడును జనులు ఆకాశము నుండి సూచక క్రియలను చూచి శుభ దినములను, నక్షత్రములను చూచుచున్నారు, రాశి ఫలితాలను చూచుచున్నారు. నేడును కొందరు ఆకాశమును తేరి చూచి, ఆకాశమందున్న వస్తువులను దేవతలగా పూజించుచున్నారు. సూర్య నమస్కారము చేయుచున్నారు. చివరకు ఆకాశమండలము నందుగల దురాత్మ సమూహముల చేతిలో చిక్కుకొనుచున్నారు.

అయితే యేసుక్రీస్తు ఆకాశమును తేరిచూచిన మూడు ప్రాముఖ్యమైన సందర్భములు కలదు. ఆకలితో ఉన్న ప్రజలకు భోజనము పెట్టుటకు ముందుగా ఐదు రొట్టెలను రెండు చేపలను తీసు పట్టుకొని ఆకాశమువైపు కన్నులెత్తి చూచి ఆశీర్వదించెను (మత్తయి. 14:19) ఆ రొట్టెలను విరిచి శిష్యుల వద్దకిచ్చినప్పుడు, రొట్టెలు అత్యధికమగుచూనే ఉండెను. ఐదువేల మందికి పైగా తృప్తిగా తినిరి.

యేసు ఆకాశమును కనులెత్తి చూచిన రెండవ సందర్భమును మార్కు. 7:34 ‘వ వచనములో చదువుచున్నాము. చెవుడుగల నత్తివాని ఒకని ఆయన యొద్దకు తోడుకొనివచ్చిరి, అప్పుడు ఆయన వానిని జనసమూహములో నుండి ఏకాంతమునకు తోడుకొనిపోయి, వాని చెవులలో తన వ్రేళ్లుపెట్టి ఉమ్మివేసి, వాని నాలుకను ముట్టి, ఆకాశమువైపు కన్నులెత్తి చూచి, నిట్టూర్పు విడిచి –ఎప్ఫతా అని వానితో చెప్పెను; ఆ మాటకు తెరవబడుమని అర్థమునైయున్నది. వెంటనే వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడెలెను, వాడు తేటగా మాట్లాడెను (మార్కు. 7:32-35). ఆకాశమును కన్నులెత్తి చూచినప్పుడెల్లను ప్రభువు మీకు అద్భుతమును చేయును. మీ యొక్క ప్రార్థనకు నిశ్చయముగా జవాబును ఇచ్ఛును.

యేసు ఆకాశమును కన్నులెత్తి చూచిన మూడవ సంఘటను యోహాను 17 ‘వ అధ్యాయము మొదటి వచనములో చదువుచున్నాము. “యేసు ఈ మాటలు చెప్పిన తరువాత ఆకాశమువైపు తన కన్నులెత్తి యిట్లనెను : తండ్రీ, నా గడియ వచ్చియున్నది, నీవు నీ కుమారుని కిచ్చిన వారికందరికిని ఆయన నిత్యజీవమును అనుగ్రహించునట్లు సర్వశరీరుల మీదను నీవు ఆయనకు అధికారమును ఇచ్చితివి, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు, నీ కుమారుని మహిమపరచుము” అని చెప్పెను.

మన ప్రియ ప్రభువు యొక్క కన్నులు ఎల్లప్పుడును తండ్రినే తేరి చూచుచునే ఉండెను. కల్వరి సిలువలో కూడాను ఆయన కన్నులు పరమ తండ్రివైపే తేరి చూచుచూనే ఉండెను. “తండ్రి వీరిని క్షమించుము” అని చెప్పెను. చివరకు, “తండ్రి నీ చేతులలో నా ఆత్మను అప్పగించుచున్నాను” అని చెప్పి తండ్రి యొక్క చేతులలో తన యొక్క ఆత్మను అప్పగించెను.

దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క మాదిరిని వెంబడించుడి. మీ యొక్క కన్నులు ఎల్లప్పుడును పరలోకమునందు పోదిగించబడి ఉండవలెను.

నేటి ధ్యానమునకై: “మన పౌరస్థితి పరలోకమునందున్నది; అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని రాక నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము” (ఫిలిప్పీ. 3:20).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.