సెప్టెంబర్ 12 – అగాధ జలముపైన చీకటి!
“చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను” (ఆది.కా. 1:2).
నిరాకారమును చీకటి అని చెప్పుచున్నారు. పాపపు జీవితమును అంధకారము అని చెప్పుచున్నారు. చీకటి అనుట, దుష్ట మృగముల యొక్క సమయము. దుష్టులైన మనుష్యులు ఏలుబడి చేయుచున్నప్పుడు, చీకటి దేశమును ఆవరించుకొనును.
పాపులును, దుర్మార్గులును, దుష్టులును నేడు లోకములో పెరిగిపోయిరి. లోకము ఒక కటిక చీకటి తట్టునకు వెళ్ళుచున్నది. అంత్య క్రీస్తు యొక్క ఏలుబడి తట్టునకు వెళ్ళుచున్నది. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “ఇదిగో చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటికచీకటి జనములను కమ్ముచున్నది; యెహోవా నీమీద ఉదయించుచున్నాడు; ఆయన మహిమ నీమీద కనబడుచున్నది” (యెషయా. 60:2).
చీకటి యొక్క ఆధిపత్యము మారి, దేవుని యొక్క మహిమ ఉదయించునట్లు మీరు ప్రార్థించవలెను అనుట అవశ్యము. పరిశుద్ధాత్ముని యొక్క అల్లాడింపబడుట ఉన్నప్పుడు, ఆయన పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, న్యాయ తీర్పును గూర్చియు ఖండించి గ్రహింపచేయును. అప్పుడు పాపుల యొక్క హృదయములో పొడవబడినవారై కన్నీటితో మారుమనస్సును పొందుదురు. “అయ్యో, నేను ఒక పాపిగా జీవించానే, నాకు పాప క్షమాపణ కావలెనే, రక్షణ సంతోషము కావలెనే” అని తమ యొక్క దౌర్భాగ్యమైన స్థితిని గ్రహించి మారుమనస్సును పొందుదురు.
విద్యుతు వెలుగే గాని, సూర్యుని యొక్క వెలిగే గాని, మీ యొక్క ప్రాణములోనికి వెలుగును తీసుకురాలేదు. ప్రభువు యొక్క ఆత్ముడు ఒక్కడే మీ హృదయాంత రంగములోని కటిక చీకటిని తొలగించువాడు. పౌలు సౌలుగా ఉన్న కాలములో భక్తిలో వైరాగ్యముగలవాడై ఉండెను. అయితే ఆయన హృదయములో చీకటి ఉన్నందున, సంఘమును పాడుచేసెను. క్రైస్తవులను అణగద్రొక్కుటయు, బాధను కలిగించుటయు, పాడుచేయుటయు దేవునికి చేసేటువంటి సేవ అని ఆయన తలంచెను.
ఒక దినమున ఆయన దమస్కు వీధులలో వెళ్ళుచున్నప్పుడు, పరిశుద్ధాత్మ యొక్క వెలుగు ఆయనపై ప్రకాశించెను. ఆయన జీవితములో ఎంతటి మహిమగల మార్పులు! యేసుక్రీస్తు మెస్సయ్యగా ఆయన యొక్క జీవితములో ప్రవేశించెను. పాపులలో ప్రధాన పాపిని అని గ్రహింపజేసెను. ఆయన హృదయమును కప్పియున్న చీకటి తొలగిపోయెను. సత్యమును గ్రహించుకొనెను. ఎట్టి మనుష్యుడునైనను ప్రకాశింపచేయు నిజమైన వెలుగైనవాడు నిశ్చయముగానే మీ యొక్క ప్రాణములో వెలుగును మహిమను తీసుకొని వచ్చును.
ఒకానొక కాలములో సాధు సుందర్ సింగ్ క్రీస్తును ఎరుగకుండా చీకటి యొక్క ఆధిపత్యములో చిక్కుకొనియుండెను. యేసు క్రీస్తును గూర్చి బహు నీచముగా మాట్లాడెను. బైబులు గ్రంథమును చింపి నిప్పులో వడవేసెను. ఒక దినమున పరిశుద్ధాత్ముడు, ఆయన జీవితములో అల్లాడించబడెను. యేసు కొరకు సమస్తమును ద్వేషించి, ఉత్తి కాళ్లతో భారతదేశము అంతటను నడిచి ప్రభువు యొక్క నామమును హెచ్చించెను. భారతదేశము యొక్క అపోస్తులుడాయెను.
దేవుని బిడ్డలారా, ప్రభువు యొక్క వెలుగునకు రండి. పరిశుద్ధాత్ముడు మీయొక్క జీవితములో అల్లాడింపబడుటకు చోటును ఇవ్వుడి. శక్తిగలవాడు మహిమగల కార్యములను నిశ్చయముగానే చేయును.
నేటి ధ్యానమునకై: “దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో, వారందరు దేవుని కుమారులైయుందురు” (రోమీ. 8:14).