Appam, Appam - Telugu

నవంబర్ 12 – అనుమతించబడిన దైవ చిత్తము!

“ఆలాగున కాదు ప్రభువా, ….. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను; ఈ కీడు నాకు సంభవించి చచ్చి పోవుదునేమో” (ఆది.కా. 19:18,19).

ప్రభువు ఒక్కసారి మాట్లాడిన సంగతిని మరల వెనుకకు తీసుకునుటను లేదు, మార్చి చెప్పుటను లేదు. కావున ప్రభువు ఒక్కసారి మీరు ఒక అంశమును చేయునట్లుగా చెప్పిన తర్వాత, ‘అలాగున కాదు ప్రభువా’ అని ఆయన వద్ద వాదించకుడి. మరొక్క అంశమును చేయునట్లుగా ఆయనకు ఆలోచనను చెప్పకుడి. ప్రభువు యొక్క పరిపూర్ణ చిత్తము యొక్క కేంద్రములో ఉండుటయే మీకు గొప్ప ఆశీర్వాదమును తీసుకొని వచ్చును.

సొదొమ గొమొఱ్ఱా అను పట్టణములు నశింపబడుచున్న సమయములో ప్రభువు లోతు వద్ద మాట్లాడి, “నీ ప్రాణమును దక్కించుకొనునట్లు పారిపొమ్ము; నీవు వెనుకు తిరిగి చూడకుము; ఈ మైదానములో ఎక్కడను నిలువకము; నీవు నశించి పోకుండ ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా” (ఆది.కా. 19:17).

‘వెనుకకు తిరిగి చూడకుము’ అని ప్రభువు చెప్పిన మాట లోతు యొక్క భార్యకు నచ్చలేదు. ఆమె తిరిగి చూచి, ఉప్పు స్తంభముగా మారెను. ‘పర్వతమునకు పారిపొమ్ము’ అని ప్రభువు చెప్పిన మాట లోతునకు నచ్చలేదు. సమీపమున్నందున సోయరు అను ఊరునకు వెళ్ళుటయే లోతు కోరుకొనెను. అట్టి సమయమునందు ప్రభువు ఆ సంగతిని అనుమతించి ఉండినప్పటికిని, అట్టి స్థలము లోతునకు ఆశీర్వాదకరముగా ఉండలేదు.

ప్రభువు యొక్క పరిపూర్ణమైన చిత్తమును కలదు, అనుమతించబడిన చిత్తమును కలదు. ప్రభువు యొక్క పరిపూర్ణమైన చిత్తమునందు ఉన్నప్పుడు సమాధానమును, సంతోషమును ఉండును. కొన్ని సమయములలో మనము ఆయన యొక్క పరిపూర్ణమైన చిత్తమునకు సమర్పించుకొనక, ‘అలాగున కాదు ప్రభువా’ అని మన యొక్క కోరికను దేవుని వద్ద నొక్కి ఒక్కానించి చెప్పినట్లయితే, అట్టి అంశమునందు సమాధానమును సంతోషమును ఉండదు.

ప్రభువు యొక్క పరిపూర్ణమైన చిత్తమును, ఇశ్రాయేలు మన్నాను భుజించి, గురుపోతువలె బలమునొంది, కనాను నందుగల ముప్పై ఒక్క రాజులను జయించవలెను అనుటయైయుండెను. అయితే ఇశ్రాయేలీయులు ప్రభువు యొక్క చిత్తమును, ఉద్దేశమును అర్థము చేసుకొన కుండా, ప్రభువు అనుగ్రహించిన దేవదూతలు యొక్క ఆహారమునైయున్న మన్నాను అల్పముగా భావించి, దోసకాయలను, వెల్లుల్లిపాయలను, ఐగుప్తునందు భుజించిన మాంసములను తలంచుకొని ఏడ్చిరి. మాంసమును తినుటకు కోరిరి. ప్రభువు వారి మనస్సునకు నచ్చినట్లుగా మాంసమును ఇచ్చినప్పటికిని, దానిని తిండిబోతులుగా మాంసాపేక్షతో ఆశించి భుజించిన వారిపై బహుగా కోపించి వారిని నశింపజేసేను.

నీనెవె పట్టణమునకు వెళ్లునట్లుగా ప్రభువు యోనా ప్రవక్తకు చెప్పెను. అయితే యోనా యొక్క కన్నులు తర్షీషు పట్టణముపై ఉండెను. ఒకవేళ యోనా ఓడరేవునకు వచ్చినప్పుడు, తర్షీషు పట్టణమునకు వెళ్ళుటకై ఓడ సిద్ధముగా ఉండియుండవచ్చును. అయితే అందులో ప్రయాణించినప్పుడు, తుఫాను వీచుటకు ప్రారంభించెను. సముద్రము ఉప్పొంగెను చివరకు యోనా చేప కడుపులో పడలేని పాటుపడి ఆ తరువాత మారుమనస్సును పొందెను.

దేవుని బిడ్డలారా, ప్రభువు మీకు ఒక సంగతిని చెప్పుచున్నప్పుడు, ఎదురేమియు చెప్పకుండా, ఏ విధము చేతైనను జంకకుండా సంపూర్ణముగా లోబడుడి. ఆశీర్వాదములను స్వతంత్రించుకొనుటకు అదియే మార్గము.

నేటి ధ్యానమునకై: “దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు; పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు; ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా?” (సంఖ్యా. 23:19).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.