Appam, Appam - Telugu

జూన్ 04 – ప్రభువును వెదకుడి!

“సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును; యెహోవాను (ఆశ్రయించు) వెదకువారికి ఏ మేలును కొదువయైయుండదు” (కీర్తనలు. 34:10).

ప్రభువును వెతుకుచున్నవారికి ఏ మేలును కొదువైయుండదు. ఇది ప్రభువు యొక్క నిశ్చలమైన వాగ్దానము. అనేకులు కొదువ కలిగి అప్పుల సమస్యలలోను, పేదరికములోను వెళ్ళుటకు గల ప్రాముఖ్యమైన కారణము వారు ప్రభువును సరిగ్గా వెతుకక పోవుటచేతనే.

అడవికి రాజు అని పిలవబడుచున్న గొప్ప సింహపు పిల్లలు కూడాను కరువు కాలమునందు లేమిగలవై ఉండవచ్చును. సింహపు పిల్లలు ఆకలితో పస్తులు ఉండవచ్చును. అయితే రాజాధిరాజును, ప్రభువుల ప్రభువును తన యొక్క బిడ్డలను ఎన్నడను లేమిగలవారిగా విడచిపెట్టడు. వారికి ఎట్టి మేలును కొదువ కాదు. ప్రభువును వెదికిన దావీదు: “యెహోవా నా కాపరి; నాకు లేమి కలుగదు, కొదువై ఉండదు, తూలి పడను” అని ఎంతగానో అనుభవించి చెప్పుచున్నాడు చూడుడి!

అందుచేతనే దావీదు తన యొక్క వృద్ధాప్యమునందు పట్టపు యువరాజైన సొలోమోనునకు ఇచ్చిన ప్రాముఖ్యమైన ఆలోచన: “నీవు ప్రభువును వెతకవలెను” అనుటయైయుండును. “సొలొమోనా, నా కుమారుడా,….. నీవు ఆయనను వెదకినయెడల ఆయన నీకు ప్రత్యక్షమగును; నీవు ఆయనను విసర్జించినయెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసి వేయును” (1. దినవృ. 28:9).

పలు సమయములలో మన యొక్క అత్యధికమైన పనుల నిమిత్తమును ప్రభువును వేతుకక ఉండిపోవుచున్నాము. చింతలును, సమస్యలును, సొమ్మసిల్లుపాటును మనలను ఇరికించి ప్రభువు యొక్క పాదముల చెంత కూర్చుండనివ్వక చేయుచున్నాయి. ఇందువలన లెక్కించలేనన్ని సమస్యలను, శత్రువులను తలంచవలసిన పరిస్థితి వచ్చుచున్నది. పాపపు వలల యొక్క ఉచ్చులలో చిక్కుకొని అవస్తపడుచున్నాము.

దేవుని బిడ్డలారా, ముప్పు వచ్చిన తర్వాత జాగ్రత్త పడుట కంటే, ముప్పు వచ్చుటకు ముందుగా జాగ్రత్తగా ఉండుట మంచిది. ప్రతి దినము మొదట ప్రభువును వెతుకుటకు సమర్పించుకొనుడి. “వెతుకుడి అప్పుడు మీరు కనుగొందురు” అనుట ప్రభువు యొక్క వాగ్దానము కదా? (మత్తయి. 7:7). యేసు క్రీస్తు సెలవిచ్చుచున్నాడు: “కాబట్టి మీరు దేవుని యొక్క రాజ్యమును, ఆయన యొక్క నీతిని మొదట వెదుకుడి; అప్పుడు ఇవన్నియును మీకు అనుగ్రహింపబడును” (మత్తయి. 6:33).

ప్రభువును వెతుకుటచేత వచ్చుచున్న ఆశీర్వాదములు ఏమిటి? 1. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక (కీర్తనలు. 105:3). 2. యెహోవాను వెదుకువారందరిపై దేవుని హస్తము తోడుగా ఉండును (ఎజ్రా. 8:22). 3. యెహోవాను వెదుకువారిని ఆయన చేయి విడచిపెట్టడు (కీర్తనలు. 9:10). 4. యెహోవాను వెదుకువారు సమస్తమును గ్రహించుదురు (సామెతలు. 28:5). 5. యెహోవాను వెదుకువారిపై నీతివర్షమును కురిపించును. (హోషేయా. 10:12). 6. యెహోవాను వెదకువారు ధన్యులు (కీర్తనలు. 119:2).

ప్రభువును వెదికి తమ యొక్క సమస్యల నుండి విడుదలను పొందుకున్నవారు అనేకమంది. రాజైన ఆషా యొక్క దినములలో యెహోవాను వెదికినందున గొప్ప ఉజ్జీవము కలిగెను (2. దినవృ. 14:11). అలాగనే వారు యెహోవాను వెదికినప్పుడు ప్రభువు శత్రువుల అందరి చేతుల నుండి తప్పించి విడిపించి పరిపూర్ణమైన విశ్రాంతిని ఆజ్ఞాపించెను. దేవుని బిడ్డలారా, ప్రభువును వెదుకుడి; సమాధానమును, సంతోషమును, ఆశీర్వాదమును నిశ్చయముగా పొందుకొందురు.

నేటి ధ్యానమునకై: “వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని, యెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించుచున్నాడు” (కీర్తనలు. 14:2).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.