Appam, Appam - Telugu

అక్టోబరు 10 – ఒక త్రోవ కలదు!

“ఆ త్రోవయే క్రూరపక్షికైనను తెలియదు, డేగ కన్నులు దాని చూడలేదు” (యోబు. 28:7).

ఇక్కడ, డేగ అను ఒక పక్షిని గూర్చి బైబిలు గ్రంధము చెప్పుచున్నది. దాని కన్నులకు బహు పదునైన చూపుగలది. దాని కాళ్లు మిగుల బలముగలది, దాని రెక్కలు వేగముగా ఎగురుటకు సహాయము చేయుచున్నది. అవి మిగితా పక్షులను, ఎలుకను, కుందేలును మొదలగు వాటిని వేటాడి పూజించును, తన పిల్లలకు కూడాను తినిపించును. కొన్ని డేగలు ఎన్నో మైళ్ళ దూరమునకు వెళ్ళినను, తిరిగి వచ్చుచున్నపుడు దారిని ఖచ్చితముగా కనుగొని తమ గూడుకు తిరిగి వచ్చి చేరుచున్నది.

భక్తుడైన యోబు, డేగ కన్నులకు సహితము అగపడని ఒక త్రోవను గూర్చి చెప్పుచున్నాడు. ఆకాశమునందు ఎగురుచున్న విమానములు కూడా ఆ త్రోవను కనుగొనలేదు. చంద్రమండలమునకు రాకెట్టులో పయణించుచున్న అంతరిక్ష గాములకు కూడాను ఆ త్రోవ కనబడలేదు. యోబు భక్తుడు అట్టి త్రోవను గూర్చి ఒక పొడుపు కథవలె చెప్పుచున్నాడు. అదే ప్రభువు యొక్క రాకడలో పరిశుద్ధులు ఎగిరి వెళ్ళబోవుచున్న త్రోవ.

ప్రవక్తయైన యెషయా చెప్పుచున్నాడు: “అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును; అది పరిశుద్ధ మార్గమనబడును; అది అపవిత్రులు పోకూడని మార్గము అది: మార్గమున పోవువారికి ఏర్పరచబడును, మూఢులైనను దానిలో నడచుచు త్రోవను తప్పకయుందురు” (యెషయా. 35:8).

అట్టి త్రోవ మిమ్ములను పరలోకమునకు తీసుకొని వెళ్ళుచున్న త్రోవ. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది; దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునైయున్నది, దాని కనుగొనువారు కొందరే” (మత్తయి. 7:13,14).

ఆనాడు ఏలియా అదే త్రోవగుండనే అగ్ని రథములతోను ,అగ్ని గుఱ్ఱములతోను గొప్ప సుడిగాలిలో కొనుపోబడి ఉండవచ్చును. హానోకు కూడాను మరణమును చూడకుండా అదే త్రోవలోనే వెళ్లి ఉండవచ్చును. యేసుక్రీస్తు భూమిని విడిచి వెళ్ళవలసిన సమయము వచ్చినప్పుడు, మేఘములు ఆయనను ఆవరించెను. ఆ త్రోవ గుండానే ఆయన కొనిపోబడి తండ్రి యొక్క కుడిపాస్వమునందు కూర్చుండెను.

కడబూర శబ్దము ధ్వనించ బడుచున్నప్పుడు, మనము కూడాను ఆ త్రోవలోనే ఎగిరి వెళ్లేదము. ఆనాడు లోకము మనలను, ఆ త్రోవను, చూచి ఆశ్చర్యపడును. “మేఘమువలెను, ఎగయు గువ్వలవలెను గూళ్లకు ఎగసి వచ్చు వీరెవరు?” (యెషయా. 60:8). “అభినదాపు యొక్క రధమువలె ఆనాడు ఎగిరి వెళ్లెదను. నా ప్రియ యేసునిపై ఆనుకొని” అని పాడి ఆనందించెదము.

మనము లోకమునందు జీవించుచున్న కాలము కొద్దిపాటిది. అది నీడవలే పరిగెత్తుకొని వెళ్లి మరుగైపోవును (కీర్తనలు. 144:4). మాయమైపోవు ఆవిరి వంటిది (యాకోబు. 4:14). నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలపు దినములను జరుపు కొందుము (కీర్తనలు. 90:9). ప్రొద్దున అది మొలిచి, చిగిరించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును

(కీర్తనలు. 90:6). మనమైతే ప్రభువు యొక్క ఇంటిలో చిరకాలము నిలిచియుందుము.

నేటి ధ్యానమునకై: “నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును” (యోహాను. 14:3).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.