జూలై 09 – ఇంకొక స్వరము!
“మరియు ఇంకొక స్వరము పరలోకములో నుండి ఈలాగు చెప్పగా వింటిని. నా ప్రజలారా, మీరు (దాని) ఆమె పాపములలో పాలివారు కాకుండునట్లును, (దాని) ఆమె తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింప కుండునట్లును ఆమెను విడిచి వెలుపలకి రండి” (ప్రకటన. 18:4).
“మీరు, మహా బబులోను అను వేశ్య యొక్క పాపములో పాలివారుకాకుడి. పాలివారుయైనట్లయితే, ఆమెకు సంభవించు తెగుళ్లును ప్రాప్తించును” అని పరలోకము నుండి ధ్వనించు స్వరము హెచ్చరించుచున్నది. ఇక్కడ పాపపు శోధనను కలుగజేసేటువంటి ఒక స్త్రీని గూర్చి చూచుచున్నాము.
ప్రకటన గ్రంథమునందు నలుగురు స్త్రీలను గూర్చి వ్రాయబడియున్నది. మొదటిది, యెజెబెలు, ప్రభువు తుయతైర సంఘమును హెచ్చరించుచున్నప్పుడు: “తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీవుండ నిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది” (ప్రకటన. 2:20) అని హెచ్చరించెను. తనను ఒక ప్రవక్తనిగా కనబరచుకొనుచు, జారత్వపు ఆత్మను వ్యాపింపచేయువారు ప్రమాదకరమైనవారు. వారి పట్ల మనము జాగ్రత్త కలిగి ఉండవలెను.
రెండోవదిగా, సకాల వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లియైన మహా బబులోను” (ప్రకటన. 17:5). అట్టి స్త్రీ, పరిశుద్ధుల యొక్క రక్తము చేతను, యేసుని సాక్షుల యొక్క రక్తము చేతను మత్తురాళ్లైయుండుటను అపో. యోహాను చూచెను. పరలోకము నుండి వచ్చిన స్వరము ఆమెను గూర్చి హెచ్చరించుటకు తీర్మానించెను. ఆమెకు సంభవించు తెగుళ్లు ప్రాప్తింప కుండునట్లు ఆమెను విడచి వెలుపలికి రండి. ఆమె యొక్క పాపము ఆకాశము మట్టుకు వెళ్లి చేరెను. ఆమె యొక్క అంధకారములను దేవుడు జ్ఞాపకము చేసుకోనెను. (ప్రకటన. 18:14,15).
ఇట్టి అంత్యకాలమునందు సాతాను భయంకరమైన యిఛ్చాల ఆత్మలను కట్లుతెంచియున్నాడు. క్రైస్తవ ఆరాధనలైన దృశ్య చిత్రీకరణలో కూడాను చలన చిత్రములవలె, యవనస్తులను, యవనస్తురాళ్లను నాట్యమాడించి ఆరాధించుచున్నారు. ఆరాధన అను ముసుగులో అబద్ధపు కాలయాపన సంగీతములనే ఇవి వ్యాపింప చేయించుచున్నదే గానే, ఏ విధము చేతనైనను పరిశుద్ధతను ఏర్పరచుట లేదు. కావున ఇట్టి బబులోను స్త్రీని విడిచి బయటికి రండి.
మూడోదిగా, సూర్యుని ధరించిన స్త్రీని గూర్చి ప్రకటన 12 ‘వ అధ్యాయమునందు చదువుచున్నాము. అక్కడ సూర్యుడు అని కనబడుచున్నది, నీతి సూర్యుడైయున్న ప్రభువును సూచించుచున్నది (మలాకి. 4:2). సూర్యుణ్ణి ధరించియున్నవారిని బైబిలు గ్రంధము పిలుచుచున్నది. “లెమ్ము, తేజరిల్లుము; నీకు వెలుగు వచ్చియున్నది, యెహోవా మహిమ నీమీద ఉదయించెను” (యెషయా. 60:1). నాల్గవదిగా, ఒక స్త్రీని ప్రకటన గ్రంథమునందు సంధించుచున్నాము. ఆమెయే గొర్రె పిల్ల యొక్క భార్య. ఆమెయే పవిత్రమైన కన్యకగా ఉన్న పవిత్రమైన వధువు సంఘము (ప్రకటన. 19:7-9). దేవుని బిడ్డలారా, ప్రభువుతోను, ఆయన యొక్క సంఘముతోను ఏకమైయుండుడి. అప్పుడు ఆయన యొక్క రాకడలో మీరు కనబడుట నిశ్చయము.
నేటి ధ్యానమునకై: “గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్నుతాను సిద్ధ పరచుకొనియున్నది; గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరచెదమని చెప్పగా వింటిని” (ప్రకటన.19:7).