Appam, Appam - Telugu

ఆగస్టు 14 – స్వస్థపరచును

“రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును; వానికి రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు” (కీర్తనలు. 41:3).

బైబిలు గ్రంథమునందు పలు రకములైన పడకలను మీరు చూడవచ్చును. ఏలియా సమ్మసిల్లిపోయి, బదరీ వృక్షము క్రింద పండుకొనియుండెను. దైవ చిత్తమును చేయుటకు ఇష్టములేక, దిశను మార్చుకొని పయనము చేసిన యోనా ఓడ యొక్క అడుగు భాగములో పండుకొనియుండెను. తరువాత ప్రభువు వద్ద కోపగించుకుని సొర చెట్టు క్రింద పండుకొనియుండెను. సంసోను, వేశ్యల ఒడిలో, క్షణికమైన సుఖాల పడకలపై పండుకొనియుండెను. ఇలాగున పలువురు పలు కారణములచేత పండుకొని యుండినను, ఒక్క పడక మన యొక్క శ్రద్ధనంతటిని ఆకర్షించుచున్నది.

ఆ పడకయే బేతెస్థ కోనేటి వద్ద ఉన్నది. ఒక మనుష్యుడు ముఫ్ఫైఎనిమిది సంవత్సరాలుగా వ్యాధిగ్రస్తునిగా, నమ్మికయంతయు కూల్పోయి అక్కడ పండుకొనియుండెను. బేతెస్థ కోనేటిలో అనేకులు స్వస్థత పొందుకొని వెళ్ళుటను చూచెను. అయితే అతనికి సహాయము చేసి కోనేటి లోనికి తీసుకుని వెళ్లి దించుటకైతే ఒకరును లేరు.

“రోగశయ్య మీద పడియున్న వానిని యెహోవా ఆదరించును” అను వచనము చొప్పున, యేసుక్రీస్తు కనికరమునందు సంపన్నుడై ఆ బేతెస్థ కోనేటి వద్దకు వచ్చి, ప్రేమతో అతనిని చూచి, ‘స్వస్థపడ గోరుచున్నావా?’ అని అడిగి, “నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని చెప్పెను. వెంటనే వాడు స్వస్థతనొంది తన పరుపెత్తుకొని నడిచి వెళ్లెను” (యోహాను. 5:8,9) అని బైబిలు గ్రంధమునందు చూచుచున్నాము.

నీడ యొక్క మాధుర్యము ఎండలోనే తెలియను అని చెప్పుదురు. పలు సమయములలో ప్రభువు మనకు దయచేసియున్న ఆరోగ్యము యొక్క గొప్పతనము మనము తలంచి చూచుటనులేదు! ప్రభువును కృతజ్ఞతతో స్తుతించుటనులేదు. రోగశయ్య మీదనే ఆరోగ్యము యొక్క ఆశీర్వాదములన్నిటిని తలంచుచున్నాము.

వ్యాధి యొక్క సమయములోనే విశ్వాసముతో ప్రభువును తెరి చూచి మొరపెట్టుచున్నాము. ఆయన వైద్యులందరి కంటెను గొప్ప వైద్యుడు. “నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను; నాకు అసాధ్యమైనదేదైన కార్యము నుండునా?” (యిర్మియా. 32:27) అని ఆయన అడుగుచున్నాడు.

దావీదు రోగశయ్య మీద ఉన్నప్పుడు, అతడు ఎప్పుడు మరణించును అని ఒక సమూహము కనిపెట్టుకొని ఉండెను. రోగసయ్య మీద ఉన్నప్పుడు, కొందరు వచ్చి అవిశ్వాసపు మాటలను చెప్పి సొమ్మసిల్లి పోవునట్లు చేయుదురు. అట్టి సమయమునందే తమ కుటుంబ ఆస్తి పంపకాల సమస్యను గూర్చి మాట్లాడుదురు. అయితే మీరు, “నేను చావను, సజీవుడనై, యెహోవా యొక్క క్రియలను వివరించెదను” (కీర్తనలు. 118:17) అని విశ్వాసముతో మాట్లాడుడి.

“దేవా, నీవు నా ఆయుష్షు దినములను పొడిగించినట్లయితే నేను నీకు సాక్షిగా ఉందును. నీకు పరిచర్యను చేసేదెను; నీ నామమును హెచ్చించెదను” అని మొక్కుబడిని చేయుడి. అప్పుడు ప్రభువు మీ యొక్క ఆయుష్షును పొడిగించును. రోగశయ్యమును మార్చి మంచి స్వస్థతను బలమును ఆరోగ్యమును అనుగ్రహించును.

నేటి ధ్యానమునకై: “జీవమును ప్రేమించి, మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను, అతడు కీడునుండి తొలగి, మేలు చేయవలెను, సమాధానమును వెదకి, దాని వెంటాడవలెను” (1. పేతురు. 3:10,11).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.

// Day of week // Sunday=0, Monday=1, Tuesday=2, Wednesday=3, Thursday=4, Friday=5, Saturday=6