Appam, Appam - Telugu

ఆగస్టు 04 – విన్నపమును ఆలకించితిని!

“నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని” (1. రాజులు. 9:3).

యవ్వనస్తుడైయున్న సొలోమోను, ప్రభువుపై అమితమైన ప్రేమను ఉంచి, ఆయనకు మహా గొప్ప దేవాలయమును కట్టించెను. దానిని ప్రతిష్ట చేయుచున్నప్పుడు, ఆయన చేసిన పొడవాటి ప్రార్ధనను 1. రాజులు. 8:22-53 ‘యందు కనబడుచున్న లేఖన భాగములో చూచుచున్నాము. అది ఒక సాధారణమైన ప్రార్థన. మనసారా ప్రభువు వద్ద మాట్లాడుటయే ఆసక్తిగల ప్రార్థనయైయున్నది. నిశ్చయముగానే అట్టి ప్రార్థనకు జవాబు కలదు.

‘యెహోవా ఎవరైతే విరిగినలిగిన హృదయముతో ఈ ఆలయమునకు వచ్చి, కన్నీటితో నిన్ను తేరి చూచి, విలపించి ప్రార్థించుచున్నారో, అట్టి ప్రార్థనకు నీ యొక్క కన్నులు తెరవబడినదిగాను, చెవులు గమనించుచున్నది గాను ఉండును గాక’ అనుటయే సొలోమోను యొక్క విన్నపమునైయుండెను.

దూర దేశము నుండి ఈ ఆలయము ఉన్న దిక్కునకు తేరిచూచి, బహుశా ఒక పాపి గాని, వెనక పడిపోయిన ఒకడు గాని, కరువు చేత పీడించబడుచున్న ఒక పేదవాడు గాని, శత్రువుల చేత ఓడించబడి బహుశా ప్రార్థించవచ్చును. వర్షము కురవని సమయములో గాని, తెగుళ్లు వ్యాధి సోకిన సమయములో గాని ప్రజలు ప్రార్థించవచ్చును. అట్టి వారి యొక్క విన్నపములను, విజ్ఞాపనలను ప్రభువు విని, కనికరించి, అంగీకరించుచున్నప్పుడు సొలోమోనునకు ఎంతటి ఆనందము కలిగియుండును!

దేవుని బిడ్డలారా, మీరు విరిగిన మనస్సుతో దేవాలయమునకు వెళ్లి ప్రభువు యొక్క బలిపీఠము వద్ద మోకరించి, మనస్సునందు నోచుకుని ఏడ్చుచు చేయుచున్న ఒక ప్రార్ధనను ప్రభువు నిశ్చయముగా విని జవాబునిచ్చును. మీయొక్క కన్నీటిని తృణీకరించి, ఎన్నడను దాటి వెళ్లేవాడు కాదు. మీయొక్క కన్నీళ్లు ఆయన యొక్క కవళికలో ఉన్నది. నిశ్చయముగానే ఆయన జాలిపడి ఒక అద్భుతమును చేయును.

కొన్ని సంవత్సరములకు పూర్వము, ఒక దుర్మార్గుడు ఒక అబద్ధమును ఆడి, ఒకరి గృహమును అపహరించి, దుర్మార్గులైన రౌడీలకు అమ్మివేసెను. దాని ఫలితముగా ఆ బాధితుడు పడిన పాట్లు ఇంతా అంతా కాదు. ఎన్నో రకములైన భయపెట్టడాలు, బెదిరింపులు ఆయనకు వచ్చెను.

ఒక దినమున ఒకడు టెలిఫోన్లో అసహ్యమైన దుర్భాషలతో ఆయనను తిట్టెను. ఆయన మనస్సు విరిగిపోయెను. ఆయన తిన్నగా ప్రభువు యొక్క ఆలయమునకు పరిగెత్తుకొని వెళ్లి, అతని యొక్క అబద్ధపు ఆధారములను పరిచి పెట్టి ప్రార్థించెను. ప్రభువునకు స్తోత్రము! ప్రభువు అతని యొక్క విన్నపముల శబ్దమునకు చెవి యోగ్గి ఆలకించెను. “కుమారుడా కలవరపడకము, నీవు కొండలను త్రొక్కునట్లుగా పిలవబడిన వాడవు. మట్టి గుట్టలను చూచి ఎందుకని భయపడుచున్నావు?” అని చెప్పెను. అంతటితో అట్టి సమస్య తీరిపోయేను.

దేవుని బిడ్డలారా, నేడు మీయొక్క హృదయమును ముళ్లువలె గుచ్చుచున్న సమస్యలు ఏది? మీ ఎదుట పర్వతమువలె నిలబడుచున్న సమస్య ఏది? అట్టి సమస్యలను ప్రభువు యొక్క ఆలయమునకు తీసుకొని రండి. దేవుని సముఖములో నీ మనస్సును పరచి ఉంచుడి. నేడు చూచుచున్న ఐగుప్తీయుని మీరు ఇక ఎన్నడను చూడరు. దుర్మార్గులైన అందరి వసములో నుండి ప్రభువు మిమ్ములను విడిపించును.

నేటి ధ్యానమునకై: “నా శత్రువుల యెదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు; నా గిన్నె నిండి పొర్లుచున్నది” (కీర్తనలు. 23:5).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.

// Day of week // Sunday=0, Monday=1, Tuesday=2, Wednesday=3, Thursday=4, Friday=5, Saturday=6