అక్టోబరు 14 – సామెతలు!
“జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి, న్యాయ, యథార్థతల ననుసరించుట యందును బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును” (సామెతలు. 1:2,3).
లోకము యొక్క జ్ఞానము చేత శ్రేష్టమైన జ్ఞానిగా విరాజిల్లినవాడు సొలోమోను. యవ్వన వయస్సునందే ఆయనకు ఇవ్వబడిన గొప్ప రాజ్యపు బాధ్యతను, దానిని తాను నెరవేర్చలేని అర్హతను ఆయన గ్రహించిన వాడైయుండెను.
కావున దేవుని యొక్క జనులను న్యాయము తీర్చుటకును, నీతిని జరిగించుటకును దేవుని వద్ద జ్ఞానమును అడిగెను. “ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయమును తీర్చగలవాడు ఎవ్వడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకముగల హృదయము దయచేయుము” (1 రాజులు. 3:9) అని చెప్పెను.
“సొలొమోను చేసిన యీ మనవి ప్రభువునకు అనుకూలమాయెను గనుక, దేవుడు అతనికి ఈలాగు సెలవిచ్చెను– నీవు నీకు దీర్ఘాయువునైనను అడుగకను, ఐశ్వర్యమునైనను అడుగకను, నీ శత్రువుల ప్రాణమునైనను అడుగకను, న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఈలాగున అడిగినందున, నీ మనవిని ఆలకించుచున్నాను; బుద్ధి వివేకములుగల హృదయమును నీకిచ్చుచున్నాను; పూర్వికులలో నీవంటివాడు ఒకడును లేడు, ఇకమీదట నీవంటివాడొకడును ఉండడు” (1. రాజులు. 3:10-12) అని చెప్పెను.
నీతి, న్యాయము, న్యాయతీర్పుపై అక్కర కలిగియున్న ప్రభువు, అందు నిమిత్తమే సొలోమోనునకు జ్ఞానమును అనుగ్రహించెను. మీ యొక్క జీవితములో కూడాను నీతిని న్యాయమును జరిగించుటకు మీ మనస్సును త్రిప్పుచున్నప్పుడు, ప్రభువు మీకు జ్ఞానమును దయచేయును. అలాగైయితే, నీతియు న్యాయమును ఎంత ప్రాముఖ్యమైనది! సొలోమోను రచించిన గ్రంథమును గూర్చి, “జ్ఞానోక్తులు” అని పేరును పెట్టలేదు. “సామెతలు” అనియే పేరును పెట్టిరి. అందులో నీతి, న్యాయము, వివేకము అనువాటిని గూర్చిన ఉపదేశమును చూడవచ్చును (సామెతలు. 1:3).
సొలోమోనును ప్రభువు నీతి న్యాయములను గ్రహించేటువంటి వివేకము చేత నింపియున్నందున, “అతడు మూడువేల సామెతలను చెప్పెను, వెయ్యిన్ని యయిదు కీర్తనలు రచించెను” (1. రాజులు. 4:32). “మరియు, ప్రసంగి జ్ఞానియైయుండెను గనుక, అతడు జనులకు జ్ఞానము బోధించెను; అతడు ఆలోచించిన సంగతులను పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరచెను” (ప్రసంగి. 12:9).
ఆ తర్వాతి కాలమునందు వచ్చిన యూదారాజైన హిజ్కియా యొక్క సేవకులు సొలోమోను పలికిన సామెతలను ఎత్తి వ్రాసిరి (సామెతలు. 25:1). అన్ని కాలములయందును ఇట్టి లేఖన వచనములు, ప్రభువు యొక్క నీతి న్యాయములను ప్రకటించుచూనే ఉన్నాయి.
లేఖన వాక్యామను సారముగా ఒకడు తన జీవితమును అమర్చు కొనుచున్నప్పుడు, అతడు నీతిమంతుడిగా రానించుటతో పాటు జ్ఞానిగాను, పరిశుద్ధునిగాను విరాజిల్లును. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: అతడు “సామెతలను, దాని భావసూచక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢవాక్యములను గ్రహించుకొనును” (సామెతలు. 1:6).
నేటి ధ్యానమునకై: “నీతి సమాధానమును కలుగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును” (యెషయా. 32:17).