అక్టోబరు 12 – నీతి న్యాయములను బట్టి!”
“నీ న్యాయవిధులను బట్టి, దినమునకు ఏడు మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను” (కీర్తనలు. 119:164).
ప్రభువు యొక్క నీతి న్యాయములు దావీదును సంతోషింప చేయుటతోపాటు ఆశ్చర్యపడునట్లుగా చేసెను. అంత మాత్రమే కాదు, ఒక దినమునకు ఏడుసార్లు స్తుతించునట్లుగా ఆయనను పూరికొల్పి లేవనెత్తిను. మనము ప్రభువు యొక్క నీతిని తలంచి స్తుతించుచున్నప్పుడు, నిశ్చయముగానే ఆయన తన యొక్క నీతిని స్థిరపరచును.
నీతి న్యాయములను బట్టి ఏడుసార్లు నేను స్తుతించెదను అని దావీదు మ్రొక్కుబడి చేసుకుని ఉండుటను చూడుడి. ఏడుసార్లు అనుట పరిపూర్ణతను, పూర్తిగా మనస్సునందు సంతృష్టిని, తృప్తిని కనబరుచుచున్నది. నయమాను కుష్ఠిరోగము పోవుట కొరకు, ఏదో రెండు సార్లు కాదు ఏడుమార్లు యోర్దానులో మునిగెను. షునేమిరాళ్లు యొక్క కుమారుడు మరణించి, మరలా సజీవముగా తిరిగి లేచినప్పుడు, ఏడు సార్లు తుమ్మి కన్నులను తెరిచెను. యాకోబు తన యొక్క సహోదరుడైన ఏశావుతో సమాధానము చేసుకొనుట కొరకు, “ఏడుసార్లు నేలమట్టుకు ఒంగి నమస్కరించి, తన సహోదరుని వద్దకు వెళ్లి చేరెను” (ఆది.కా. 33:3).,
మీ యొక్క నీతి, న్యాయములు బయలుదేరుచున్నప్పుడు, నీతి గల దేవుడ్ని ఒక దినమునకు ఏడుసార్లు స్తుతించుడి. ఏడు డెబ్బదిసార్లు స్తుతించుడి. ‘నీతిని జరిగించుచున్న దేవా, నీకు స్తోత్రము! అని మానక చెప్పుడి. ప్రభువు నిశ్చయముగానే మీకు నీతి న్యాయమును చేయును. మనుష్యులు అన్యాయముగా కీడును చేసి మీపట్ల నీతిని తప్పించ వచ్చును. అయితే ప్రభువు నీతి గల న్యాయాధిపతిగా మీ కొరకు మార్గమును చూపించి, నీతిని స్థిరపరచును.
ప్రభువు యొక్క నీతి న్యాయములను గూర్చి స్తుతించుచున్న మీరు, నీతి నిజాయితీలను తప్పిపోకుండా నమ్మకముతోను యధార్థముతోను జీవించుటకు తీర్మానించుడి. “ఆయన వచ్చి, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఖండించి ఒప్పుకొనజేయును” (యోహాను. 16:8).
మిమ్ములను నీతిమంతులుగా మార్చుటలో క్రీస్తునకు ఒక ప్రాముఖ్యమైన భాగము కలదు. ఆయనను ఎరిగేటువంటి జ్ఞానము చేతనే, నీతి మీలోనికి వచ్చి నివాసము ఉండును. క్రీస్తు యొక్క నీతిని మీరు స్వతంత్రించుకొందురు. “నీతిమంతుడైన నా సేవకుడు తనకున్న అనుభవజ్ఞానముచేత అనేకులను నీతిమంతులుగా చేయును” (యెషయా. 53:11). మీరు క్రీస్తు యొక్క నీతితో ఏకమైయుండుడి.
పాత నిబంధనలో క్రీస్తు యొక్క నీతిని ఆశ్రయించు గొప్ప ధన్యత ఇశ్రాయేలీయులకు లభించలేదు. వారు పది ఆజ్ఞలు అను ధర్మశాస్త్రపు నియమమునే నీతిగా కలిగియుండిరి. ఆ నీతి వారిని పరిపూర్ణత చెందించలేదు. ఇందువలన వారు శాపములను, మనోవేదనలను పొందిరి.
క్రొత్త నిబంధన పరిశుద్ధులైయున్న మనము ఎంతటి ధన్యులము! మనము మన యొక్క స్వనీతిని నమ్ముకుని ఉండలేదు. పరిపూర్ణత చెందించలేని చట్టములను నమ్మి ఉండలేదు. క్రీస్తే మీకు నీతిగా ఉన్నాడు. పాపము ఎరుగని ఆయన మీ కొరకు పాపమాయెను. తన యొక్క నీతి వస్త్రములను మీకు ధరింపజేసి మిమ్ములను నీతిమంతులుగా చేసియున్నాడు.
దేవుని బిడ్డలారా, మీ పరుగు యొక్క ముగింపులో నీతి కిరీటమును ప్రభువు యొక్క చేతుల మీదుగా పొందుకొందురు.
నేటి ధ్యానమునకై: “నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనునట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకొనవలెను” (ద్వితి. 16:20).