జూన్ 08 – చింతలయందు ఆదరణ
“మార్తా, మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారముకలిగి తొందరపడుచున్నావు, గాని అవసరమైనది ఒక్కటే” (లూకా. 10:41).”
చింతలు, కలతలను కలుగజేయుచున్నవి; కన్నీటిని రప్పించుచున్నాయి; దుఃఖపు నిట్టూర్పులను ఏర్పరచు చున్నాయి. మనము జీవించుచున్న ఈ యుగము అత్యంత చింతలు గల ఒక యుగము. పలువిధములైన చింతల చేత తమ్మును క్షీణింప చేసుకునేటువంటి అమాయకులైన ప్రజలను అనేకులను చూచుచునప్పుడు హృదయము మనకు తెలియకుండానే బార మగుచున్నది.
చింతను, కన్నీటీతో నిండిన ఈ లోకమునందు మీకు ఆదరణ ఇచ్చువాడు ఉన్నాడంటే ఆయన యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే. ఆయన యొక్క పాదముల వద్దకు పరిగెత్తుకొని వచ్చి, ఆయన బంగారపు ముఖమును తేరి చూచినప్పుడు, మీ అంతరంగమందు గల చింతలన్నియు తొలగి దైవిక సమాధానపు కాంతి రేఖలు మీ యందు ప్రకాశించును.
బైబిలు గ్రంథము నందు, మార్తకు అనేక పనుల గురించిన చింతలు కలిగియుండెను. గృహ నిర్వాహపు చింత, విస్తారమైన పనులు చేయుట యందు గల చింత; శత్రువులను గూర్చిన చింత; అయితే, చింతలను తీర్చేటువంటి యేసుని వద్ద సమయమును ఖర్చుపెట్టి ఆదరణను పొందుటకు ఆమెకు అసాధ్యమై యుండెను.
యేసు చింతించుచు కలత చెందియున్న మార్తను చూచి, మనసారా ఆమెకు ఆదరణను చెప్పుటకు కోరెను. “అందుకు ప్రభువు మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచార ముకలిగి తొందరపడుచున్నావు గాని, అవసరమైనది ఒక్కటే, మరియ ఆమె యొద్దనుండి తీసివేయబడదని ఉత్తమమైనదానిని ఏర్పరచుకొనెను” (లూకా .10:41,42) అని ఆమెతో చెప్పి, దైవిక ప్రేమను ఆమె ఎందుకని పొందుకొన లేకపోయెనో అను సంగతిని ప్రేమతో వివరించెను.
బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది, “మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింప నేల? అడవిపువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి: అవి కష్టపడవు, ఒడకవు అయినను, తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదానివలెనైనను అలంకరింపబడలేదు అని మీకు చెప్పుచున్నాను” (మత్తయి. 6:27-29).
మీరు క్రీస్తు యొక్క పాదముల చెంత ఖర్చుపెట్టుటకు కొంత సమయమును కేటాయించినట్లయితే, అది మీకు ఎంతగానో ఆదరణను మనస్సునందు ఓదార్పును ఇచ్చును. మీ చింతల బారినుండి విడిపింప బడుకు అదియే మార్గము అను సంగతిని గ్రహించు కొందురు. “ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక, మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి” (1.పేతురు. 5:7) అని అపోస్తులుడైన పేతురు ఆలోచనను చెప్పుచున్నాడు.
దేవుని బిడ్డలారా, ఆయనే మీయొక్క సమాధాన కర్త కదా? ఆయనే మీయొక్క చింతలను తీర్చు మహా గొప్ప ఔషధము కదా? ఇప్పుడే మీయొక్క చింతలన్నిటిని ఆయన మీద మోపివేసి విడుదలను పొందుకొనుడి
నేటి ధ్యానమునకై: “ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక, మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి” (1.పేతురు. 5:7).