నవంబర్ 27 – హింసించు వారికొరకు!
“మిమ్మును నిందించువారి కొరకును, మిమ్మును హింసించు వారికొరకును ప్రార్థన చేయుడి” (మత్తయి. 5:44).
ప్రార్థన యోధుడును మన యొక్క ప్రార్థనలకు మాదిరి కరమైనవాడునైయున్న యేసుక్రీస్తు ప్రార్థన గూర్చి మొట్టమొదటిగా మాట్లాడిన మాటలు ఇవియే. “మిమ్మును నిందించువారి కొరకును, మిమ్మును హింసించు వారికొరకును ప్రార్థన చేయుడి” (మత్తయి. 5:44).
సహజముగా తమ యొక్క శత్రువుల కొరకును, తమ్మును హింసించువారి కొరకును ఏ ఒక్కరు గోజాడి ప్రార్థించరు. వారి యొక్క ప్రార్థనలు అన్నియును వారి కొరకును, వారి పిల్లల కొరకును, కుటుంబము కొరకును అమర్చబడి ఉండును. అయితే యేసుక్రీస్తు ప్రార్ధనలో శత్రువుల కొరకు ప్రార్థించుటయే ప్రధానముగా సూచించుచున్నాడు. దానిని గూర్చి మొట్టమొదటి బోధను ఇచ్చెను.
శత్రువుల కొరకును, శపించు వారికొరకును, నిందించు వారికొరకు, హింసించు వారికొరకును ప్రార్ధించవలెను అంటే, మొట్టమొదట క్షమించేటువంటి తలంపు మీయొక్క అంతరంగమునందు రావలెను. యేసు కల్వరి సిలువలో వేలాడుచున్నప్పుడు కూడాను శత్రువుల కొరకు ప్రార్థించి, “తండ్రి వీరిని క్షమించుము” అని ప్రార్ధించెను కదా? అట్టి క్రీస్తు యొక్క తలంపును, క్షమించు దయా గుణమును ఆయన వద్ద నుండి పొందుకొనుడి. ఎటువంటి ద్వేషమును, వైరాగ్యమునకును చోటివ్వకుడి.
యోబు గ్రంథములో మొదటి నలభై అధ్యాయములను చదువుచున్నప్పుడు ఆయన యొక్క స్నేహితులు తమ యొక్క మాటల చేత ఆయనను గాయపరచిరి. అయితే యోబు భక్తుడు చేసినది ఏమిటి? వారి కొరకు ప్రార్థన చేసి విజ్ఞాపన చేసెను. ఇందువలన ప్రభువు యోబు యొక్క చెరను మార్చివేసేను. యోబు కోల్పోయిన వాటినన్నిటి రెండు రెట్లుగా పొందుకొనెను (యోబు. 42:10).
అనేకులు, “సహోదరుడా నా యొక్క అత్తగారి కొరకు లేక కోడల కొరకు నావల్ల ప్రార్థన చేయలేను” అంటారు. ఇటువంటి సమస్యల కొరకే, పరిశుద్ధ ఆత్ముడ్ని తండ్రియైన దేవుడు మీలో నివసింప నిచ్చియున్నాడు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్ముని వలన దేవుని యొక్క ప్రేమ మన యొక్క హృదయములలో కుమ్మరించబడియున్నది (రోమీ. 5:5) అని బైబిలు గ్రంథము చెప్పుచున్నది.
మన యొక్క హృదయములలో కుమ్మరించబడియున్న దేవుని ప్రేమ చేత మనము నిశ్చయముగానే మనలను ద్వేషించు వారి కొరకును ప్రార్థించగలము. నేడు మొదలుకొని దేవుని ప్రేమ చేత నింపబడి మీ శత్రువుల కొరకు ప్రార్థించుడి.
దేవుని బిడ్డలారా, మీరు సత్యమును ఎల్లప్పుడును మరచిపోకూడదు. ప్రభువు ఎట్టి పాపినైనను ప్రేమించుచున్నారు. కౄరులందరికొరకు ఆయన మరణించియున్నాడు. దుష్ఠుల కొరకును దుర్మార్గుల కొరకును తన యొక్క రక్తమును చిందించియున్నాడు. ఏ ఒక్కరు కూడాను నశించి పోవుట ఆయనకు చిత్తము లేదు. “నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుటవలన నాకు సంతోషము లేదు; దుర్మార్గుడు తన దుర్మార్గతనుండి మరలి బ్రదుకుటవలన నాకు సంతోషము కలుగును” (యెహేజ్కేలు. 33:11) అని ప్రభువు చెప్పుచున్నాడు.
నేటి ధ్యానమునకై: “నేనతనికి పాలు పంచి పెట్టెదను ఘనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును. అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయెను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసినవారిని గూర్చి విజ్ఞాపనముచేసెను” (యెషయా. 53:12).