Appam, Appam - Telugu

నవంబర్ 08 – పరిశుద్ధాత్ముని యొక్క స్వరము!

“సత్యస్వరూపియైన ఆత్ముడు వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యము లోనికి నడిపించును; …. సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును” (యోహాను. 16:13).

పలు సమయములలో మన యొక్క జీవితములో అడ్డమైన ఇరుకు సందుల్లో దారి తెలియక నిలబడుచున్నాము. పలురకాల మార్గములలో ఒక దానిని మనము ఎంచుకొన వలసినదైయున్నది. అట్టి మార్గములను గూర్చిన చలినంత జ్ఞానము మనకు లేదు. మనకు జ్ఞానము తక్కువనైయున్నది.

అయితే పరిశుద్ధాత్ముడు సమస్తమును పరిశీలించి తెలుసుకొనుచున్నాడు. ఆయన సకలమును సరిగ్గా నిదానించి వివేచించుచున్నవాడు. ఆయన ఒక్కడే మనలను సరైన మార్గములో త్రోవ నడిపించుకుని వెళుచున్నవాడు. ఆయన త్రోవ నడిపించిన యెడల మనము ఎన్నడును దిశతప్పి పోము. ప్రభువు యొక్క మార్గములు నిత్యమైన ఆశీర్వాదమును మన జీవితములోనికి తీసుకొని వచ్చును.

పరిశుద్ధాత్ముడు మనతో కూడా ఉండుటయు, మనలో నివాసముండుటయు ఎంతటి ఔనత్యమైన అంశము! కొనసాగించి బైబిలు గ్రంధమును చదివి చూడుడి. నడిపించు పరిశుద్ధాత్ముడు మాట్లాడుచున్న జ్ఞానమును కూడాను అనుగ్రహించును. “మీరేమి చెప్పవలసినది అను సంగతిని పరిశుద్ధాత్ముడు ఆ గడియలోనే మీకు నేర్పుననెను” (లూకా. 12:12).

మాట్లాడవలసిన సిరియైన జ్ఞానముగల మాటలను తగిన సమయములో పరిశుద్ధాత్ముడు మీయొక్క నాలుకనకు ఇచ్చి శ్రేష్టమైన విద్యావంతులవలె మాట్లాడునట్లు చేయను. ఆనాడు పేతురు మాట్లాడిన మాటలను గూర్చి అందరును ఆశ్చర్యపడిపోయిరి. విద్యా జ్ఞానము లేని చేపలను పట్టుచున్న పేతురు యొక్క మాటలు బైబిలు గ్రంధములో ఎంతటి అత్యధిక స్థానమును కలిగియున్నది చూడుడి. ఆయన వ్రాసిన పత్రికలను అలాగునే పరిశుద్ధాత్ముడు బైబిలు గ్రంథముతో జతపరచియున్నాడు కదా?

పౌలును, బర్నబాను పరిచర్య మార్గములో పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షతలను ఇచ్చి ఎంత చక్కగా త్రోవ నడిపించెను (అపో.కా. 13:2). పరిచర్యను ప్రారంభించుటకు త్రోవను నడిపించినవాడు, సేవ యొక్క మధ్యభాగములోను, చివరివరకును త్రోవనడిపించెనే.

ప్రభువు త్రోవ నడిపించునట్లుగా మీయొక్క చేతులను మాత్రము గాక, మీ యొక్క అంతరంగమును ఆయనకు అప్పగించుకొనుడి. ఆయనే ‘ఆల్ఫా’, ఆయనే ‘ఒమేగా’. విశ్వాసమును ప్రారంభించు వాడును, కడముట్టించువాడును ఆయనయే. ఆయన వద్ద మిమ్ములను పరిపూర్ణముగా సమర్పించుచున్నప్పుడు, మీరు దేనికిని కలతచెంద వలసిన అవసరము లేదు. ప్రభువు పై మీ పూర్తి భారమును మోపివేసి ఆయనలో విశ్రమించుడి.

ఫిలిప్పును సమరియలో బహు బలముగా వాడబడిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఆయన వద్ద “గాజాకు పోవు అరణ్యమార్గమున పొమ్ము” అనెను (అపో.కా. 8:26). అలాగున స్పష్టమైన స్వముతోను, స్పష్టమైన ప్రణాళికతోను, మెల్లని స్వరము ద్వారాను, మీతో కూడా మాట్లాడును.

దేవుని బిడ్డలారా, త్రోవ నడిపించుటకు శక్తిగల దేవుడు జీవితపు నాయకుడు. ఆయనే మన యొక్క జీవితపు నాయకుడు.

నేటి ధ్యానమునకై: “మీరు కుడి తట్టయైనను తిరుగుచున్నప్పుడు, ఎడమ తట్టయైనను తిరుగుచున్నప్పుడు: –ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని మీ వెనుకనుండి యొక శబ్దము మీ చెవులకు వినబడును” (యెషయా. 30:21).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.