Appam, Appam - Telugu

అక్టోబరు 03 – రాకడయొక్క కాలము (సమయము)!

“వేషధారులారా, మీరు భూమ్యాకాశముల వైఖరి గుర్తింప నెరుగుదురు; ఈ (కాలము) సమయమును మీరు గుర్తింప నెరుగరేల?” (లూకా. 12:56).

మీరు రాకడ యొక్క సమయమును గుర్తించి ఎరుగవలెను అనుట ప్రభువు యొక్క వాంఛయైయున్నది. ఆకాశమునందు కలుగు వాతావరణపు స్థితులను పలురకాల పరికరములతో విజ్ఞానము వెంటనే గ్రహించి దూరదర్శిని ద్వారా జనులకు ముందుగా ప్రకటించుచున్నది.

కొన్ని గ్రామములయందు ఉన్న రైతులు, విద్యా జ్ఞానములేనివారై ఉండినప్పటికిని, మేఘము ఎర్రగా కమ్ముకొని వచ్చుటను చూసి తద్వారా వర్షము కురియును అను సంగతిని చెప్పుచున్నారు. సునామీ వలన పెనుగాలితో పాటు సముద్రపు అలలు ఉప్పొంగుచు వచ్చుటకు పలు గంటల సమయమునకు ముందుగానే మృగ జీవరాసులన్నీయు ఆ సంగతిని గ్రహించి సురక్షితమైన స్థలములకు వెళ్ళిపోవుచున్నాయి.

యేసు చెప్పెను: “సాయంకాలమున మీరు–ఆకాశము ఎఱ్ఱగా ఉన్నది గనుక వర్షము కురియదనియు, ఉదయమున– ఆకాశము ఎఱ్ఱగాను, మబ్బుగాను ఉన్నది, గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు గదా. వేషధారులైన మీరు ఆకాశవైఖరిన వివేచింప నెరుగుదురు గాని యీ కాలముల సూచనలను వివేచింపలేక ఉన్నారే?” (మత్తయి. 16:2,3). ఎర్రటి మేఘమును, కారు మబ్బును రాకడ యొక్క సూచనలై ఉన్నవి. కడవరి వర్షము ప్రతి చోట గురియుచూనే ఉన్నది. పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకము ప్రతి స్థలమునందును కుమ్మరించబడుచు ఉండుటను చూచుచున్నాము.

తాను జీవించిన కాలమునందు: “కాలమును సద్వినియోగపరచుకొనుడి” అని నోవాహు జనులకు ఎంతగానో ప్రసంగించెను. నూట పది సంవత్సరములు జనులకు ప్రేమతో హెచ్చరించి ప్రసంగించుచు వచ్చెను అని బైబిలు గ్రంధము యొక్క పండితులు చెప్పుచున్నారు.

అయితే జనులు, నిర్విచారముగా ప్రభువు తమకు ఇచ్చిన హెచ్చరిక స్వరమును సద్వినియోగ పరచుకొనలేదు. అకస్మాత్తుగా జడివాన కురిసెను. ఆకాశపు తూములన్నియు విప్పబడెను. అట్టి జల ప్రళయము యొక్క నీళ్లు ఓడను ఒకవైపున పైపైకి తేలజేసెను. లోబడని ప్రజలపై ప్రభువు యొక్క న్యాయ తీర్పును తీసుకుని వచ్చి వారిని ముంచివేసెను.

మరి ఎక్కువగా పరిశుద్ధాత్మ అను గొప్ప వర్షము అన్ని స్థలములయందును కుమ్మరించబడుచునే ఉన్నది. సంఘము అను ఓడను క్రీస్తు తన రాకడలో లేవనెత్తి మధ్యాకాశమునకు తీసుకుని వెళ్ళును. మరోవైపు లోక ప్రజలపై భయంకరమైన న్యాయ తీర్పు వచ్చును.

క్రీస్తు వచ్చుచున్న దినమును గాని, గడియనుగాని సూచించి మనము చెప్పలేకుండా ఉండినప్పటి, క్రీస్తు యొక్క రాకడ సమయము సమీపించియున్నది అనుటకు గల గుర్తులను చూచుచున్నాము.

దేవుడి బిడ్డలారా, మీకు ఇవ్వబడియున్న కృప యొక్క ప్రతి ఒక్క తరుణమును మీరు సద్వినియోగ పరుచుకున్నట్లయితే, క్రీస్తు యొక్క రాకడ దినములో ఆనందముతో ఆయనను ఎదుర్కొని వెళ్లుదురు. ప్రభుతో నిత్యానిత్యముగా జీవింతురు.

నేటి ధ్యానమునకై: “ఇదిగో, త్వరగా వచ్చుచున్నాను; వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాతో కూడా (యొద్ద) వచ్చుచున్నది” (ప్రకటన. 22:12).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.