ఆగస్టు 09 – సమృద్ధి!
“యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు; క్రుంగజేయువాడును, లేవనెత్తువాడును ఆయనే” (1. సమూ. 2:7).
హన్నా ప్రభువు యొక్క పరిశుద్ధమైన సౌందర్యమును గూర్చియు, ప్రభువు యొక్క జ్ఞానమును గూర్చియు, ప్రభువు యొక్క జీవింపజేయు శక్తిని గూర్చియు కీర్తించి పొగెడెను. ఇక్కడ ప్రభువు ఇచ్చుచున్న సమృద్ధిని, ఐశ్వర్యమును గూర్చి మాట్లాడుచున్నది.
లోకమునందు జీవించుటకు ధనము అవసరమే. “భౌతిక వస్తువులు లేనివారికి ఈ ప్రపంచము చెందదు” అని తిరువళ్లువర్ అన్నారు. ఆహారమునకును, వస్త్రాలకును మరియు నివాసములకును డబ్బు అవసరము. ప్రభువు యొక్క సేవకు కూడాను డబ్బు అవసరము.
మన దేవుడు ఆకాశమును భూమిని కలుగజేసిన మహా గొప్ప సంపన్నుడైయున్నాడు. వెండియు అయనది, బంగారమును ఆయనది. ప్రభువు మిమ్ములను ఐశ్వర్యవంతులుగా చేసి, హెచ్చించుటకు శక్తిగలవాడు. మీరు మొట్టమొదటిగా ప్రభువు యొక్క రాజ్యమును నీతిని వెతుకుచున్నప్పుడు, మిగతావన్నియును మీకు దయచేయును.
ఇస్సాకు దేశమునందు విత్తనము విత్తెను. ప్రభువు ఆయనతో ఉండి ఆశీర్వదించుట చేత ఇస్సాకునకు నూరులెట్లు ఫలితమును ఆజ్ఞాపించెను. ఇస్సాకు యొక్క దేవుడు మీ యొక్క దేవుడు. ఆయన మీయొక్క రాబడిని పలు రెట్లు ఆశీర్వదించుటకు శక్తిగలవాడు. మీరు నేడు ఉంటున్న స్థితి కంటెను వెయ్యిరెట్లు మిమ్ములను ఆశీర్వదించి హెచ్చించెను.
ప్రభువు యొక్క కొలత లేని ఆశీర్వాదమును పొందుకొనునట్లుగా మీరు ప్రభువు కొరకు మనఃపూర్వకముగా ఇవ్వడి. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును వాని నీతి నిత్యము నిలుచును వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును” (కీర్తనలు. 112:9).
“బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును” (సామెతలు. 19:17). వెదజల్లి అభివృద్ధిపొందువారు కలరు. తగినదానికన్న తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. “బీదలకిచ్చు వానికి లేమి కలుగదు; తన కన్నులు మూసికొనువానికి బహు శాపములు కలుగును” (సామెతలు. 28:27) అని బైబిలు గ్రంధము చెప్పుచున్నది.
నేడు విదేశాల నుండి సహాయమును పొంది కొందరు అనాధ ఆశ్రమములను నడిపించుచున్నారు. వేదాంత కళాశాలలను నడిపించుచున్నారు. వృద్ధుల ఆశ్రమములను నడిపించుచున్నారు. వెధవరాలకు సహాయమును చేయుచున్నారు. ఇవి అన్నియును మంచి కార్యములే. అయితే అత్యధికమంది అందులో నమ్మకముగా ఉండుటలేదు అనుటయే బాధాకరమైన వార్త.
“మీకు కలిగియున్న వాటిని అమ్మి దరిద్రులకు ఇమ్ము” అని క్రీస్తు చెప్పుచున్నాడు. మీరు పేదలకు ఇచ్చుట అయినను సరే, ప్రభువునకు ఇచ్చుట అయినను సరే అందులో మీ త్యాగము అత్యధికముగా ఉండవలెను. మీ యొక్క జాలియు అందులో ఏకమైయుండవలెను. దేనిని చేసినాను దానిని మనుష్యుల కొరకు చేయక ప్రభువు కొరకు మనఃపూర్వకముగా చేయుడి.
“ఇయ్యుడి అప్పుడు మీకును ఇవ్బవడును; మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడును” (లూకా. 6:38).
నేటి ధ్యానమునకై: “వాడు ఉన్నతస్థలమున నివసించును; పర్వతములలోని శిలలు అతనికి కోటయగును” (యెషయా. 33:15,16).