Appam, Appam - Telugu

జూలై 11 – ఇంకొక సూచన!

“అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను; ఇదిగో యెఱ్ఱని మహాఘటసర్పము; దానికి ఏడు తలలును, పది కొమ్ములును ఉండెను; దాని తలలమీద ఏడు కిరీటములుండెను” (ప్రకటన. 12:3).

ఆదికాండము గ్రంథము, “ఆదియందు” అను మాటతో బైబిలు గ్రంథము ప్రారంభించబడి, ప్రకటన గ్రంథము యొక్క వెనుకటి భాగములో “పరలోకమందు” అను మాట పదే పదే చోటుచేసుకునుటతో ముగియబడుచున్నది. తమ యొక్క ప్రారంభమును క్రీస్తుతో ప్రారంభించువారు, నిశ్చయముగానే ఆకాశము అను పరలోకములో స్థానము పొందుదురు అనే సంగతిని ఇది గ్రహింప చేయుచున్నది.

ఆకాశము అనుటకు ఆకాశ విశాలము అనియు, ఉన్నతము అనియు, పరలోకము అనియు, పలు అర్థములు కలదు. ఆకాశపు పక్షులు ఎగిరి తిరిగేటువంటి ఆకాశము కలదు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు ఉన్న ఆకాశము కలదు. సాతాను తనకు నివాస స్థలముగా ఉంచుకునియున్న ఆకాశమండలము కలదు. అదే సమయములో పరదేశుగా ఉన్న ఆకాశము, క్రొత్త భూమియుండు ఆకాశము, కొత్త ఆకాశము అను చెప్పబడు పరలోక రాజ్యము ఉన్న ఆకాశమును కలదు.

ప్రభువు యొక్క రాకడకు అనేక సూచనలు ఉన్నట్లుగా, సాతానను అంతిక్రీస్తు భూమిమీదకు దిగి వచ్చుటకును అనేక సూచనలు ఉన్నాయి. అతడు ఆకాశమునందు తన యొక్క సింహాసనమును అమర్చుకొని, ఆకాశమండలము నందుగల దురాత్మల సమూహములను తన కొరకు పెట్టుకునియున్నాడు. మనము క్రీస్తు యొక్క రాకడ యొక్క సూచనలను చూచి ఆనందముతో ఆయనను ఎదుర్కొనుటకు సిద్ధపడుచున్న అదే సమయమునందు, అంత్యక్రీస్తు యొక్క సూచనలను చూచి హెచ్చరికతో ఉండుట మిగుల ఆవశ్యము.

అపో. పౌలు చెప్పుచున్నాడు: “నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్యవిషయమైన ప్రేమను అవలంబింపక పోయిరి గనుక, వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను, నానావిధములైన సూచక క్రియలతోను, మహత్కార్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను, నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించియుండును” (2. థెస్స. 2:9,10).

నేడును ఐరోపాదేశము అంతయును తమ్మును సమాధానముగా పరిపాలించుటకు ఒక నియంత కావలెను అని ఎదురుచూచుచున్నది. ఓకే నాణ్యము, ఓకే వీసా, ఓకే పాస్పోర్టు, ఓకే సైన్యము అని రూపించుచున్నది. లోకమును ఏలబోయేటువంటి అధిపతికి కొరకు ఒక స్థలమును, అతడు ఉపయోగించుట కొరకు మిగుల శక్తి గల కంప్యూటరును రూపించియున్నారు. ఆకాశపు సూచనలను చూచి, మీరు యేసు క్రీస్తు యొక్క రాకడకు సిద్ధపడవలెను. లేక, అంత్యక్రీస్తు యొక్క పరిపాలనకు సిద్ధపడవలెను.

దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథమును మరలా మరలా చదివి చూడుడి. ఆ గ్రంథము నిశ్చయముగానే మిమ్ములను యేసుని రెండవ రాకడకు సిద్ధపరచును. రెండవ రాకడ బహు సమీపము అనుట కొరకు సూచనలు బహుతుల్యముగా కనబడుటకు ప్రారంభించి నందున ఇప్పుడే ప్రభువు యొక్క రాకడకు మిగుల భయభక్తితో సిద్ధపడుడి.

నేటి ధ్యానమునకై: “కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించుకొని, మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థనచేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను” (లూకా. 21:36).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.