నవంబర్ 11 – దేవుని సమాధానము ద్వారా!
“క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలు చుండనియ్యుడి; ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి; మరియు కృతజ్ఞులైయుండుడి” (కొలస్సీ. 3:15).
ప్రభువు పలు రకములలో మనతో మాట్లాడును. పలు సమయములలో ప్రభువు మన అంతరంగ జ్ఞానేంద్రముల ద్వారా మాట్లాడును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమునైయున్నందున (సామెతలు. 20:27) మీ యొక్క ఆత్మీయ గ్రహింపు ద్వారా దేవుని యొక్క నడిపింపును గ్రహించుకొనుడి. ప్రభువు మీవద్ద మాట్లాడుచున్నప్పుడు, మీ యొక్క అంతరంగమునందు పరిపూర్ణ సమాధానము నివసించును. సంతోషమును మనస్సునందు నిండుతనమును పొందుకొందురు.
దీర్ఘ కాలముగా వివాహము కాకుండా ఉన్న ఒక సహోదిరికి, వివాహము కుదిరినప్పుడు, ఆ సహోదరి పెండ్లి పత్రికను తీసుకుని నా వద్దకు ప్రార్థించుకొనుటకు వచ్చెను. ఆమె వద్ద నేను సహోదరి, “ఎంతోమంది వరుడు సంబంధాలు వచ్చినప్పటికీ నీవు సమ్మతించక, ఈ వరుని సంబంధానికి సమ్మతిని తెలియజేయుట ఎలా? అని అడిగాను.
అందుకు ఆమె: “మిగతా వరుల సంబంధాలు వచ్చిన్నప్పుడల్లా నా యొక్క అంతరంగమునందు కలవరమును, భయమును ఉండును. అయితే ఈ వరుని సంబంధము వచ్చినప్పుడు నా యొక్క అంత్రీయెంద్రములన్నీయును ఈయనే ప్రభువు నీకు నియమించిన వరుడు అని గ్రహింపజేసెను. పరిపూర్ణ దైవీక సమాధానము నా అంతరంగమునందు వచ్చెను. మా తల్లిగారు కూడాను, ఆ వరుని సంబంధము చూచుటకు వెళ్ళినప్పుడు, నా అంతరంగమునందు ఒక సంతోషము ఏర్పడెను. నిన్ను కంటతడి పెట్టక చివరి వరకు ప్రేమతో చూచుకొనును అని నా మనస్సులో అనిపించుచున్నదని చెప్పిరి” అని జవాబును ఇచ్చెను.
బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందము” (రోమీ. 5:1). సమాధానమునందు మూడు భాగములు కలదు. మొట్టమొదటిది, దేవునియందు సమాధానము. రెండోవది, దేవునితో సమాధానము. మూడోవది, దేవుని యొక్క సమాధానము. అవును, అంతరంగము సమాధానముతో ఉంటేనే ప్రభువు మాట్లాడెను అని గ్రహించుకొందురు.
అయితే దేవుని యొక్క చిత్తముగా లేకుండా ఉన్నప్పుడు, అంతరంగమునందు భయమును కలవరమును అధిగమించుచుండును. అప్పుడు అది ప్రభువు మాట్లాడినది కాదు అనుటను స్పష్టముగా తెలుసుకొనవచ్చు. “భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని, అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టుచున్న దత్తపు స్వీకృత త్రాత్మను పొందితిరి” (రోమీ. 8:15). “దేవుడు మనకు పిరికితనముగల ఆత్మ నియ్యలేదు గాని, శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను” (2. తిమోతికి. 1:7).
ప్రభువు మీతో మాట్లాడుటకు ఎల్లప్పుడును దేవునితో సంభాషించి ఆనందించుచున్నాడు. మీకును దేవునికిని మధ్య ఎట్టి పాపమును అడ్డు రాకుండునట్లు మిగుల జాగ్రత్తగలవారై ఉండుడి. ఎల్లప్పుడును పరిశుద్ధతను కాపాడుకొని, దేవుడితో కూడా సంభాషించి సత్సంబంధమును కలిగియుండుడి.
దేవుని బిడ్డలారా, దైవ చిత్తమును చేయుచున్నప్పుడును, దేవుని చిత్తమును అడుగుచున్నప్పుడును, ” సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకును మీ తలంపులకును యేసుక్రీస్తువలన కావలియుండును” (ఫిలిప్పీ. 4:7).
నేటి ధ్యానమునకై: “ప్రభువు యొక్క ఆత్మ యెక్కడనుండునో అక్కడ స్వాతంత్ర్య మునుండును” (2. కొరింథీ. 3:17)