ఆగస్టు 13 – సంతోషపరచుడి
“నా దేవా, నీకు (చిత్తము) ప్రీతికరమైనది నెరవేర్చుట నాకు సంతోషము” (కీర్తనలు. 40:8).
మొట్టమొదట, ప్రభువును ప్రియపరచవలెను అను వాంఛ మీలో ఉండవలెను. అట్టి వాంఛ లేకున్నట్లయితే మీరు ఇష్టము వచ్చినట్టు ఒక నామకార్థపు క్రైస్తవులవలె ఉందురు.
ప్రభువు మీద ఉన్న ప్రేమయే ఆయనను ప్రియపరచునట్లు చేయుచున్నది. అది ఆయనతో చేయికలిపి నడువవలెను అను కోరికను తీసుకొని వచ్చును. అలాగున ప్రభువును ప్రియపరచి చేయికలిపి నడుచున్నప్పుడు, ఆయన కూడాను ప్రేమతో మిమ్ములను చూచి: ‘నీవు నాకు బహు ప్రియువాడవు అనియు నా ప్రియురాలా! నీవు రూపవతివి’ అని పిలుచును.
సాదు సుందర్ సింగ్ ప్రభువుతో జడబాయకుండా నడిచినవాడు. ఆయన జీవితమునంతటిని ప్రభువు కొరకు సమర్పించినవాడు. ఒకసారి ఆయనను ఒక యువరాజు ప్రేమతో తన యొక్క అంతఃపురమునకు తీసుకుని వెళ్లెను. అతడు క్రైస్తవ మార్గమునందును, ఆత్మీయ అంశములయందును అత్యధిక ఆసక్తిని కనబరచెను.
అతడు “అయ్యా, నేను యేసుక్రీస్తు ద్వారా ఎన్నో ఆశీర్వాదములను పొందుకొని ఉండినను, ఆయనను బహిరంగముగా ఒప్పుకోలేని నా బలహీనత కొరకు బాధపడుచున్నాను. ఆ విధముగా నేను బహిరంగముగా ఒప్పుకున్నట్లయితే, నా సొంత దేశ ప్రజలు నన్ను ద్వేషించి వెలివేయుదురు. నా రాజ్య పరిపాలన హక్కు కూడా నా యొద్దనుండి తీసివేయబడును” అని చెప్పెను.
సాదు సుందర్ సింగ్, యవ్వనస్తుడైన అట్టి యువరాజును చూచి: “మీరు భూమి మీద జీవించుట కొద్ది దినములే. అయితే పరలోకమునందు జీవించబోవుచున్నది, నిత్యమైనది. లోక రాజ్యములు త్వరగా కుప్పకూలును. నిత్య రాజ్యములయితే నిత్యా నిత్యము నిలిచియుండును. మీరు ఈ లోక జీవితమునందు క్రీస్తుతో చేయిపట్టి నడిచినట్లయితే, ఆయన నిరంతరమును మీతో కూడా చెయిపట్టి నడిచునట్లు తేజోమయమైన పరలోక రాజ్యములోనికి తీసుకుని వెళ్ళను”. “మొదట దేవుని యొక్క రాజ్యమును, ఆయన యొక్క నీతిని వేదకుడి” (మత్తయి. 6:33) అని జవాబును ఇచ్చెను.
మీరు దేవునిపై ఇష్టముతో, ఆనందముగా ఉండుట, దేవుడు మీపై ఇష్టముతో, ఆనందముగా ఉండుటయే క్రైస్తవ జీవితము యొక్క ఉన్నతమైన అనుభవము. అలాగున మీరు జీవించుచున్నప్పుడు, లేఖన వాక్యము యొక్క ప్రతి వచనమును మీకు రుచికరమైనదిగాను, తేనెకంటేను జుంటి తేనెధారలకంటేను మధురముగలదై ఉండును.
కీర్తనకారుడు చెప్పుచున్నాడు: “యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రమును దానిని ధ్యానించువాడు ధన్యుడు” (కీర్తనలు. 1:2). దేవుణ్ణి ప్రియపరచుటకు తీర్మానించిన దావీదు రాజు చెప్పుచున్నాడు: “నీ ధర్మశాస్త్రము ననుసరించుటకు నాకు బుద్ధిని దయచేయుము; అప్పుడు నా పూర్ణహృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను; దానియందు నన్ను నడువజేయుము” (కీర్తనలు. 119:34,35).
దేవుని బిడ్డలారా, ప్రభువును ప్రియపరచుటకు నిత్యము కోరుచుయున్నప్పుడు, సంఘ ఐక్యతయు, ఆలయ ఆరాధన కూడాను మీకు ఆనందకరమైన అనుభవముగా ఉండును. కావున ప్రభువును ప్రేమించి ఆత్మతోను సత్యముతోను ఆయనను ఆరాధించి ఆనందించుడి.
నేటి ధ్యానమునకై: “మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక; మా చేతిపనిని మాకు స్థిరపరచుము” (కీర్తనలు. 90:17).