ఆగస్టు 03 – ముఖాముఖిగా చూచితిని!
“నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని చెప్పి, ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను” (ఆది.కా. 32:30).
యాకోబు యొక్క హృదయమునందు, “దేవుని యొక్క ముఖమును చూచువారు ప్రాణమును దక్కించుకొనలేక చనిపోవుదురు” అను తలంపును కలిగియుండెను. పాత నిబంధనయందు అనేకమంది పరిశుద్ధులు కూడాను అలాగునే తలంచిరి. ఆయన దహించు అగ్ని అనియు, సమీపించలేని తేజస్సునందు వసించువాడనియు అనేకులు తలంచిరి.
ఒకవైపున ఆయన దహించు అగ్నిగాను, కోపించు దేవుడుగాను ఉండినప్పటికీని, మరోవైపున ఆయన గొప్ప ప్రేమయు జాలియుగలవాడు. మోషేతో మాట్లాడుచున్నప్పుడు: “మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడునట్లుగా, యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను” (నిర్గమ. 33:11) అని బైబిలు గ్రంధములో చెప్పబడియున్నది.
పలు కుటుంబమునందు తండ్రులు తమ పిల్లల వద్ద ప్రేమతోను, సాత్వికముతోను ప్రవర్తించుట నేను చూచియున్నాను. పిల్లలు మంకుపట్టుతో ఏడ్చున్నప్పుడు కూడాను ఆప్యాయతతో మందలించుట మాత్రమే చేసి వారిని సరియైన మార్గమునకు తెచ్చుదురు. పిల్లల యొక్క చదువులు, క్రమశిక్షణ మొదలగు వాటికి అత్యధిక ప్రాముఖ్యతను ఇచ్చుచున్నవారు, పిల్లల కొరకు దేనినైనను చేయుటకు సంసిద్ధులైయున్నారను సంగతి వారి యొక్క ముఖములయందు ప్రతిపలించుచూనే ఉండును. అలాగుననే ప్రభువు యొక్క ముఖము కూడాను కృపగలదిగా ఉన్నది.
ప్రభువు యొక్క ముఖములో మొట్టమొదటిగా, దైవ ప్రసన్నత ఉన్నది. అట్టి ప్రసన్నతలోనుండి సమాధానము దిగి వచ్చుచున్నది. ప్రతిసారి కూడాను సంఘకాపరులు సంఘస్తులను ఆశీర్వదించుచున్నప్పుడు: ‘ప్రభువు తన యొక్క ముఖకాంతిని మీపై ప్రకాశింపజేసి, మీకు సమాధానమును కలుగజేయును గాక’ అని చెప్పుచున్నారు (సంఖ్యా. 6:26).
ప్రభువు యొక్క ముఖకాంతి ఇచ్చుచున్న సమాధానము మహా గొప్ప ఔన్నత్యమునైయున్నది. అది లోకము ఇచ్చుటకును తీసివేయుటకును కుదరని సమాధానము కదా, అది సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము. ఆయన యొక్క ముఖకాంతి చేత హృదయమునందు ఆనందమును సంతోషమును కలుగుచున్నది.
రెండోవదిగా, ఆయన యొక్క ముఖకాంతిలో నుండి అత్యధికమైన కృపగల ఐశ్వర్యమును పొందుకొనుచున్నాము. “యెహోవా నీకు తన (సన్నిధిని) ముఖకాంతిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక” (సంఖ్యా. 6:25). చూడండి ప్రభువు యొక్క ముఖ కాంతిలో నుండి ఒక వెలుగు వచ్చుచున్నది, అట్టి వెలుగు మధురమైన కృపగా మారుచున్నది. జీవము కంటేను నీ కృప ఉత్తమమైనది అని చెప్పి కీర్తనాకారుడైన దావీదు ప్రభువును స్తుతించెను.
ప్రభువు యొక్క ముఖమును దర్శించేటువంటి మార్గమును దావీదు బహు చక్కగా నేర్పించుచున్నాడు. “నేనైతే నీతిగలవాడనై నీ ముఖదర్శనము చేసెదను; నేను మేల్కొనునప్పుడు నీ స్వరూపదర్శనముతో నా ఆశను తీర్చుకొందును” (కీర్తనలు. 17:15). దేవుని బిడ్డలారా, ప్రేమగల తండ్రి యొక్క ముఖమును పిల్లలు వాంఛించున్నట్లుగా, ప్రభువు యొక్క ముఖమును వాంఛించుడి. “నీ సేవకుని మీద నీ ముఖకాంతిని ప్రకాశింపజేయుము, నీ కట్టడలను నాకు బోధింపుము” అని చెప్పి ప్రార్థించుడి (కీర్తనలు. 119:135). ఆయన ముఖకాంతి యొక్క ఆశీర్వాదములను పొందుకొనుడి.
నేటి ధ్యానమునకై: “నా సన్నిధి వెదకుడని నీవు సెలవియ్యగా యెహోవా, నీ (సన్నిధి) ముఖమును నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను” (కీర్తనలు. 27:8).